logo

టీఎస్‌ఆర్టీసీ ‘హైదరాబాద్‌ దర్శన్‌’

ప్రపంచ పర్యాటక దినోత్సవం నాడు.. టీఎస్‌ఆర్టీసీ ‘హైదరాబాద్‌ దర్శన్‌’ పేరుతో రెండు బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. పర్యాటకులు 12 గంటల్లో ముఖ్యమైన సందర్శనా ప్రాంతాలను తిలకించేలా ఈ యాత్రలను

Published : 28 Sep 2022 02:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచ పర్యాటక దినోత్సవం నాడు.. టీఎస్‌ఆర్టీసీ ‘హైదరాబాద్‌ దర్శన్‌’ పేరుతో రెండు బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. పర్యాటకులు 12 గంటల్లో ముఖ్యమైన సందర్శనా ప్రాంతాలను తిలకించేలా ఈ యాత్రలను రూపొందించింది. మెట్రోలగ్జరీ ఏసీ బస్సుతో పాటు.. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సును సంస్థ ఎండీ వీసీ.సజ్జనార్‌తో కలిసి ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ మంగళవారం ఆర్టీసీ కళామండంపంలో ప్రారంభించారు. ప్రస్తుతం శని, ఆదివారాల్లోనే ఇవి నడుస్తాయి. 10 శాతం టిక్కెట్‌ ధరపై రాయితీ ఇస్తున్నట్టు సంస్థ ఎండీ పేర్కొన్నారు.

సందర్శన ఎక్కడెక్కడంటే.. ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్‌ సమీపంలోని ఆల్ఫా హోటల్‌ బస్టాపు నుంచి ఈ బస్సు బయలుదేరి 9 గంటలకు బిర్లామందిర్‌, 10.30కు చౌమహల్లా ప్యాలెస్‌ చేరుతుంది. సందర్శన అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు తారామతి బారాదరి హరిత రిసార్ట్‌ వద్ద, తర్వాత 2 గంటలకు గోల్కొండ కోటకు చేరుకుంటుంది. సాయంత్రం 4 గంటలకు దుర్గం చెరువు తీగల వంతెనపై ప్రయాణిస్తాయి. సాయంత్రం 6.30కు ఎన్టీఆర్‌ పార్కు, హుస్సేన్‌సాగర్‌ సందర్శన, రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని