logo

ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి సీఏలు కీలకం

దేశ ఆర్థిక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో చార్టెడ్‌ అకౌంటెంట్ల(సీఏల) పాత్ర ఎంతో కీలకమని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

Published : 03 Dec 2022 04:25 IST

 గవర్నర్‌ తమిళిసై  
ఇష్టంగా పనిచేస్తే ఒత్తిడి దూరం: కపిల్‌దేవ్‌

ఐసీఏఐ ప్రతినిధుల బృందంతో గవర్నర్‌ తమిళిసై. చిత్రంలో దేబాషిస్‌ మిత్ర, అనికేత్‌ సునీల్‌, సుశీల్‌కుమార్‌ తదితరులు

మాదాపూర్‌, న్యూస్‌టుడే: దేశ ఆర్థిక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో చార్టెడ్‌ అకౌంటెంట్ల(సీఏల) పాత్ర ఎంతో కీలకమని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. పన్ను చెల్లింపులపై ప్రజలకు అవగాహన పెంచి నడిపించే బాధ్యత సీఏలపై ఉంటుందని సూచించారు. శుక్రవారం ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో ‘ఫేసింగ్‌ ది ఫ్యూచర్‌’ పేరిట సీఏ విద్యార్థుల కోసం మాదాపూర్‌ శిల్ప కళావేదికలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్‌ మాట్లాడుతూ.. చార్టెడ్‌ అకౌంటెంట్లు ఉన్నతంగా ఆలోచించాలని, తమ వృత్తిలో నిజాయితీగా, పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఐసీఏఐ అధ్యక్షులు దేబాషిస్‌ మిత్ర మాట్లాడుతూ.. ఐసీఐఏలో 3,25,000 మంది సభ్యులు ఉన్నారని, 8 లక్షల మంది విద్యార్థులు సీఏ కోర్సు చదువుతున్నారన్నారు. ఐసీఏఐ ఉపాధ్యక్షులు అనికేత్‌ సునీల్‌ తలాటి, ప్రతినిధులు దయనివాస్‌శర్మ, సుశీల్‌కుమార్‌ గోయల్‌, శ్రీధర్‌ ముప్పాల తదితరులు పాల్గొన్నారు.

ప్లాన్‌ బీ ఊహే వద్దు.. అంతకుముందు ఇదే సదస్సులో మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ విద్యారులనుద్దేశించి మాట్లాడారు. ఒత్తిడి అనే పదాన్ని యువత తమ నిఘంటువు నుంచి తొలగించాలని, ఇష్టంగా చేసే పనిలో ఒత్తిడి ఉండదని సూచించారు. ‘నేటి కార్పొరేట్‌ ప్రపంచం.. ఏదైనా పని చేయాలంటే ప్లాన్‌ ఏ, ప్లాన్‌ బీ, ప్లాన్‌ సీ ఉండాలని చెబుతుంది. నేను దీన్ని నమ్మను, ఏ నుంచి బీలోకి వెళ్తున్నామంటే మనం బలహీనమైనట్లేనని’ నా అభిప్రాయం. మన లక్ష్యాన్ని ఎప్పుడు మార్చుకోకూడదు. దాన్ని చేరేందుకు అంకితభావంతో శ్రమించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని