logo

ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాలి

వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాలని పూర్వ వైద్యవిద్యార్థుల సంఘం డిమాండ్‌ చేసింది.

Published : 10 Dec 2022 03:22 IST

పూర్వ వైద్యవిద్యార్థుల సంఘం డిమాండ్‌

ర్యాలీలో పాల్గొన్న వైద్యవిద్యార్ధులు

ఉస్మానియా ఆసుపత్రి, న్యూస్‌టుడే: వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాలని పూర్వ వైద్యవిద్యార్థుల సంఘం డిమాండ్‌ చేసింది. శుక్రవారం ఉస్మానియా దవాఖానా నుంచి కోఠి వైద్యకళాశాల వరకూ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని పెద్దపెట్టున నినాదాలు చేశారు. పూర్వ వైద్యవిద్యార్థుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్లు వీరేశం, కృష్ణమూర్తి మాట్లాడుతూ, ఉస్మానియా వైద్యకళాశాలలో చదువుకున్న విద్యార్థులు నేడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు. ఉస్మానియాకు కొత్త భవనం నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గతంలో ఇచ్చిన హామీని ఇప్పటికైనా నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఎం నేతలు కూడా మద్దతు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని