logo

ఏజెంట్లు వెళ్తేనే లైసెన్సులొస్తాయ్‌!

రవాణా శాఖ కార్యాలయాల్లో లైసెన్సులు... రిజిస్ట్రేషన్ల వ్యవహారాల్లో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సేవలనూ ఆన్‌లైన్‌ చేసింది. చిరునామాకే లైసెన్సులు, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు వస్తాయి.

Published : 16 Dec 2022 04:31 IST

రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల దందా

ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, ఖైరతాబాద్‌, మెహిదీపట్నం, కార్ఖానా, సైదాబాద్‌, కేశవగిరి, రాజేంద్రనగర్‌, ఉప్పల్‌, పేట్‌బషీరాబాద్‌, కేపీహెచ్‌బీ కాలనీ, తుర్కయాంజల్‌ పురపాలిక:      రవాణా శాఖ కార్యాలయాల్లో లైసెన్సులు... రిజిస్ట్రేషన్ల వ్యవహారాల్లో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సేవలనూ ఆన్‌లైన్‌ చేసింది. చిరునామాకే లైసెన్సులు, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు వస్తాయి. ఇదంతా నిజం కాదు. రవాణా శాఖ కార్యాలయాల్లో ఉంటున్న ఏజెంట్లు వెళ్తేనే లైసెన్సులు వస్తాయి. వారు అడిగినంత ఇస్తేనే రాకెట్‌ వేగంతో పనులు పూర్తవుతాయి. గ్రేటర్‌ పరిధిలోని పది రవాణా శాఖ కార్యాలయాల్లో ‘ఈనాడు’ పరిశీలనలో వెల్లడైన నిజాలివి.

ఇలా చేస్తే.. గంటల్లో పనులు పూర్తి...

* ఖైరతాబాద్‌ రవాణాశాఖ కార్యాలయంలో ఏజెంట్లు చాలా పవర్‌ఫుల్‌. స్లాట్‌ బుక్‌ చేయించడం నుంచి అన్నిపనులు గంటల వ్యవధిలో పూర్తిచేస్తున్నారు.

* ఆన్‌లైన్‌లో అన్ని పత్రాలు పూర్తి చేసుకొని వచ్చినా.. మెహిదీపట్నం ఆర్టీఏ కార్యాలయంలో పట్టించుకోరు. ఏజెంట్ల ద్వారా వెళ్తేనే వాహనదారులు పాస్‌ అవుతారు.  

* మలక్‌పేట ఆర్టీఏ కార్యాలయం వద్ద ఏజెంట్లు ఏకంగా అసోసియేషన్‌నే ఏర్పాటు చేసుకున్నారు.

* బహదూర్‌పురాలోని ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో ఆధార్‌ కార్డు, పదోతరగతి మెమో లేకున్నా దళారులు లైసెన్సులు ఇప్పిస్తున్నారు.  

* అత్తాపూర్‌ ఆర్టీఏ కార్యాలయం లోపల జరగాల్సిన పనులు సగం దళారుల వద్దే పూర్తవుతాయి.

* మన్నెగూడలోని ఇబ్రహీంపట్నం రవాణా శాఖ కార్యాలయంలో దళారులకు అడిగినంత ఇస్తే రెండు మూడు రోజుల్లో లైసెన్స్‌ కార్డు ఇప్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని