లక్ష్యాలతో ముందుకు సాగితేనే భవిత
లక్ష్యాలను ఎంపిక చేసుకుని యువత ముందుకు సాగాలని జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వడ్ల నందు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఆమె ప్రారంభించారు
పోటీలను ప్రారంభిస్తున్న జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సునీతారెడ్డి
ధారూర్: లక్ష్యాలను ఎంపిక చేసుకుని యువత ముందుకు సాగాలని జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వడ్ల నందు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉన్నత చదువులు చదివిన వారు సేద్యం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక పద్ధతులను ఉపయోగించాలన్నారు. చరవాణిని అవసరం మేరకే వినియోగించాలని సూచించారు. అనంతరం ధారూర్‌లో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచి చంద్రమౌళి, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హన్మంత్‌రెడ్డి, ఫౌండేషన్ అధ్యక్షుడు వడ్లనందు, జిల్లా కోఆప్షన్ సభ్యులు అజీమ్ ఖురేషి, వైస్ ఎంపీపీ విజయ్, ఎంపీటీసీ బసప్ప, సర్పంచులు పరమేష్, పాండు, నాయకులు ఇబ్రాహిం, హఫీజ్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్గా బెడ్షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Ts-top-news News
ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!.. బాధితుడికి తెలియకుండానే ఆన్లైన్లో అకౌంట్లు
-
Sports News
ఆ సమాధానమే అర్థం కాలేదు.. వెస్టిండీస్ బ్యాటర్ డెండ్రా డాటిన్