logo

మటన్‌ మండీ తిని పలువురికి అస్వస్థత

మటన్‌ మండీ తిని పలువురు అస్వస్థత గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో గురువారం సనత్‌నగర్‌ డీఎన్‌ఎం కాలనీలోని మాషాఅల్లా హోటల్‌ను జీహెచ్‌ఎంసీ ఆహార తనిఖీ అధికారులు సీజ్‌ చేశారు.

Updated : 24 Mar 2023 07:02 IST

మాషాఅల్లా హోటల్‌ మూసివేత

ఆహార పదార్థాల శాంపిళ్లను సేకరిస్తున్న అధికారులు

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: మటన్‌ మండీ తిని పలువురు అస్వస్థత గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో గురువారం సనత్‌నగర్‌ డీఎన్‌ఎం కాలనీలోని మాషాఅల్లా హోటల్‌ను జీహెచ్‌ఎంసీ ఆహార తనిఖీ అధికారులు సీజ్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ సర్కిల్‌ ఏఎంఓహెచ్‌ డా.భార్గవ నారాయణ వివరాలిలా ఉన్నాయి. ఫతేనగర్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద డీఎన్‌ఎం కాలనీలో ఉన్న మాషాఅల్లా మండీ హోటల్‌లో మంగళవారం రాత్రి సనత్‌నగర్‌, అల్లావుద్దీన్‌కోఠి,  ఓ కంపెనీలో పనిచేసే మొత్తం 16మంది వరకు మటన్‌ మండీ తిన్నారు. బుధవారం ఉదయాన్నే వీరు వాంతులు, కడుపునొప్పి, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. సాయంత్రానికి కోలుకున్న వారిని డిశ్ఛార్జి చేశారు. మరో నలుగురు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై గురువారం స్థానికులు.. జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందడంతో ఏఎంఓహెచ్‌ డా.భార్గవ నారాయణ, సర్కిల్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీవెంక తదితరులు మాషాఅల్లా మండీ హోటల్‌లో తనిఖీలు చేశారు. కొన్నిపదార్థాల నమూనాలను సేకరించారు. ఈ విషయమై ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీవెంక మాట్లాడుతూ మాషాఅల్లా హోటల్‌ను సీజ్‌ చేశామన్నారు. నమూనాలను పరీక్షల నిమ్తితం పంపుతున్నామని లోపాలేమైనా ఉంటే నిర్వాహకులపై చర్యలుంటాయని చెప్పారు. హోటల్‌ను కార్పొరేటర్‌ కొలను లక్ష్మి, ఇతర నేతలు సందర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని