ఆర్థిక ఇబ్బందులు.. అభిప్రాయభేదాలతో దంపతుల ఆత్మహత్య
ఓ ఆటోడ్రైవర్, ట్రాన్స్‌జెండర్ మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు.. అభిప్రాయ భేదాలతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
మృతుల్లో ఒకరు ట్రాన్స్‌జెండరు
మృతులు గణేశ్, అనూష (అనిల్)
షాపూర్‌నగర్, న్యూస్‌టుడే: ఓ ఆటోడ్రైవర్, ట్రాన్స్‌జెండర్ మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు.. అభిప్రాయ భేదాలతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహదేవపురం సమీపంలోని వాంబే కాలనీకి చెందిన అనిల్ రెండేళ్ల కిందట లింగమార్పిడి శస్త్రచికిత్స ద్వారా అనూష(25)గా మారాడు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం కేశవపల్లి తాండాకు చెందిన గణేశ్(25)తో పరిచయం ఏర్పడటంతో మూడు నెలల క్రితం వివాహం చేసుకొని శివానగర్‌లో నివాసముంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తరచూ గొడవలు పడుతుండేవారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇద్దరు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గణేశ్‌కు ఇదివరకే పెళ్లయినప్పటికీ.. ఆమెకు దూరంగా ఉంటున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nayanthara: ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
-
Crime News
Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి
-
Viral-videos News
Viral Video: ఇదేం వెర్రో..? రన్నింగ్ కారుపై పుష్ అప్స్ తీస్తూ యువకుడి హల్చల్!