logo

Hyderabad: నెలకో.. రూ.11 కోట్లు హాం.. ఫట్‌!

వాట్సాప్‌ లింకులు.. రీల్స్‌, సందేశాలు. అంతర్జాలంలో కస్టమర్‌ కేర్‌ నంబర్లు.. బ్యాంకులతో పాటు సీబీఐ, ఎన్‌ఐఏ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలు..

Updated : 19 Oct 2023 08:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: వాట్సాప్‌ లింకులు.. రీల్స్‌, సందేశాలు. అంతర్జాలంలో కస్టమర్‌ కేర్‌ నంబర్లు.. బ్యాంకులతో పాటు సీబీఐ, ఎన్‌ఐఏ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలు.. చివరకు సైబర్‌క్రైమ్‌ పోర్టల్‌... కావేవీ మోసానికి అనర్హం కాదన్నట్టు మాయగాళ్లు ప్రభుత్వ/ప్రయివేటు సంస్థలు, వేదికలను తమకు అనువుగా మలచుకుంటున్నారు. పోలీసుల రికార్డు ప్రకారం సైబర్‌ కేటుగాళ్లు నగర ప్రజలను 27 అంశాలతో మోసగిస్తున్నారు. ఈ ఏడాది 9 నెలల వ్యవధిలో నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 2232 కేసులు నమోదు చేశారు. రూ.102,39,10,499 సొమ్ము బాధితులు నష్టపోయినట్టు నిర్దారించారు. అంటే నెలకు దాదాపుగా రూ.11 కోట్లను హాం..పట్‌ చేస్తున్నారని తెలుస్తోంది. నగరంలో అధికశాతం మంది సులభంగా ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడి పార్ట్‌టైమ్‌జాబ్‌/ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంటి వద్ద నుంచే ఉపాధి పొందొచ్చంటూ ఊరిస్తారు. ఆ అవకాశం వచ్చిన వారికి టాస్క్‌లిచ్చి మరో సంపాదన మార్గం చూపుతున్నామంటూ ఉచ్చులో బిగిస్తారు. ఇలా పెట్టుబడుల వలలో చిక్కిన 1018 మంది రూ.69,60,48,689 నష్టపోయారు.

అధిక రాబడులంటే అస్సలు నమ్మొద్దు

ఆన్‌లైన్‌ లావాదేవీల్లో ప్రతివేదికపై లాభాలు ఉంటాయనే ఆశతో తేలికగా మాయగాళ్ల బారినపడుతున్నారు. ఏ వ్యాపారం చేసినా రానంత ఆదాయం కేవలం పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలతో వస్తాయనగానే వాస్తవాలు ఆలోచించట్లేదు. ఆన్‌లైన్‌లో మోస పోయినట్టు గుర్తించగానే టోల్‌ఫ్రీ నంబరు 1930కు ఫిర్యాదు చేయండి

డాక్టర్‌ గజరావు భూపాల్‌, జాయింట్‌ సీపీ, నగర సీసీఎస్‌, క్రైమ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని