logo

రెండో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్‌ రాస్‌

పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్‌ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌రాస్‌ పేర్కొన్నారు.

Published : 26 Apr 2024 01:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్‌ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌రాస్‌ పేర్కొన్నారు. గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జనరల్‌, పోలీస్‌ పరిశీలకుల సమక్షంలో ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు.   ఈ సందర్భంగా  సి-విజిల్‌, ఎఫ్‌ఎస్‌టీ, యస్‌యస్‌టీ, కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పరిశీలన చేస్తున్న విషయాన్ని వివరించారు. ర్యాండమైజేషన్‌ ప్రక్రియలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్‌ సీపీ విక్రమ్‌ సింగ్‌ మాన్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రిటర్నింగ్‌ అధికారులు అనుదీప్‌ దురిశెట్టి, హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఫిర్యాదులు, సలహాల స్వీకరణ.. ఎన్నికల పకడ్బందీ నిర్వహణకు సంబంధించి పౌరుల నుంచి ఫిర్యాదులు, సూచనలు స్వీకరిస్తున్నట్లు  రోనాల్డ్‌రాస్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సంబంధించి బంజారాహిల్స్‌లోని సిటీ మేనేజర్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఉదయం 8.30నుంచి 9.30గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్టు తెలిపారు. కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఫిర్యాదులను మేడ్చల్‌ మల్కాజిగిరి కలెక్టరేట్‌లో ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు స్వీకరించనున్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ జనరల్‌ అబ్జర్వర్‌ శ్రీవిద్య, వ్యయ పరిశీలకుడిగా సెంతిల్‌కుమరన్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ జనరల్‌ అబ్జర్వర్‌ డాక్టర్‌ సరోజ్‌కుమార్‌, వ్యయ పరిశీలకుడిగా అమిత్‌కుమార్‌శుక్లా, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల పోలీస్‌ అబ్జర్వర్‌ శశంక్‌ ఆనంద్‌,  మల్కాజిగిరి జనరల్‌ అబ్జర్వర్‌గా డా.ప్రియాంకాశుక్లా, వ్యయ పరిశీలకుడిగా అమిత్‌కుమార్‌శుక్లా విధులు నిర్వర్తిస్తున్నారు.


ఓటు హక్కు వినియోగంపై అవగాహన

గర ఓటర్లను చైతన్య పరిచేందుకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ ఆదేశాలతో ఓటర్‌ చైతన్య ఫోరమ్‌లు, స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని డివిజన్‌లు, బస్తీలు, కాలనీలు, కమ్యూనిటీ హాళ్లు, మార్కెట్‌లలో స్వీప్‌ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ.. ఓటర్లకు ఓటు ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని