Telangana News: తెలంగాణలో నిప్పులు చెరిగిన భానుడు

రాష్ట్రంలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.

Published : 01 May 2024 18:11 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. బుధవారం ఎండ తీవ్రత మరింత పెరిగింది. నల్గొండ జిల్లా గూడాపూర్‌లో అత్యధికంగా 46.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మంగపేట, కొత్తగూడెం జిల్లా భద్రాచలం, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5, జగిత్యాల జిల్లా నేరెళ్ల, పెద్దపల్లి జిల్లా ముత్తారం, ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లో 46.4, మహబూబాబాద్‌ జిల్లా కొమ్ములవంచలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాదికి ఇవే అత్యధికం. ఏప్రిల్‌ 30వ తేదీ ఉష్ణోగ్రతల్లోనూ పదేళ్ల కాలంలో ఇవే గరిష్ఠం. గురువారం కూడా ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని