logo

మన కారు.. ఎవరూ పోటీ పడలేరు

సికింద్రాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్‌ నాంపల్లి నియోజకవర్గంలో రోడ్‌షోలో పాల్గొన్నారు. ఓటర్లకు కారు బొమ్మను చూపిస్తూ భారాసకు ఓటేయాల్సిందిగా స్థానికులను అభ్యర్థించారు.

Published : 08 May 2024 03:34 IST

సికింద్రాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్‌ నాంపల్లి నియోజకవర్గంలో రోడ్‌షోలో పాల్గొన్నారు. ఓటర్లకు కారు బొమ్మను చూపిస్తూ భారాసకు ఓటేయాల్సిందిగా స్థానికులను అభ్యర్థించారు.


వర్షం జోరు.. ఆగని ప్రచార హోరు

మల్కాజిగిరి లోక్‌సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ మంగళవారం కీసరలో వర్షంలోనూ ప్రచారం కొనసాగించారు.  


చేయిచేయి కలపండి.. ఓటేసేందుకు రండి

మల్కాజిగిరి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి, మధుయాస్కీ గౌడ్‌.. కొత్తపేట రాజీవ్‌గాంధీ నగర్‌లో స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. అభివాదం చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు.


ఓటర్లకు ఎప్పుడూ అభయ హస్తమే

సికింద్రాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ నేత ఫిరోజ్‌ఖాన్‌ తదితరులు సీతారాంబాగ్‌, ఆగాపుర, బోయిగూడ కమాన్‌ ప్రాంతాల్లో ప్రచారాల్లో పాల్గొన్నారు.


మందిర నమూనా.. ఓటర్లకు నజరానా

మాజీ గవర్నర్‌ తమిళిసై బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీ ఓటర్లకు రామ మందిర నమూనాలను కానుకగా అందించారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.


పాతబస్తీ.. భారాస ప్రచారం జాస్తి

హైదరాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ పాదయాత్రలపై ప్రధానంగా దృష్టి సారించారు. గోషామహల్‌ ప్రాంతంలోని సిద్ధంబర్‌ బజార్‌, భగవాన్‌గంజ్‌, మచ్చీపురలో ప్రచారం చేశారు.


కాల్మొక్కుతా.. కమలానికెయ్‌ అక్కా

కంటోన్మెంట్‌ అసెంబ్లీ భాజపా అభ్యర్థి వంశతిలక్‌కు మద్దతుగా ఎమ్మార్పీఎస్‌ నేతలు ఏడో వార్డు చిన్న కమేలా, సాయిబాబా హట్స్‌ ప్రాంతంలో ప్రచారం చేశారు. ఇల్లిల్లూ తిరిగి ఓటర్లకు పాదాభివందనం చేశారు.


అమ్మా.. గుర్తుంచుకో.. నేనే శ్రీగణేశ్‌

కంటోన్మెంట్‌ అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీగణేశ్‌ మూడో వార్డు బాలంరాయి బస్తీలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటి ప్రచారంలో వృద్ధులకు దండాలు పెడుతూ తనను గెలిపించాలని అభ్యర్థించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు