logo

ప్రత్యర్థులు ఒక్కటయ్యారు

రాజకీయంలో శాశ్వత శత్రువులు.. మిత్రులుండరు. కుత్బుల్లాపూర్‌ సెగ్మెంట్‌లో పలువురు నేతల వ్యవహారం దీనికి అద్దం పట్టేలా మారింది. మొన్నటి వరకు  కత్తులు దూసుకుని.. ఆగర్భ శత్రువుల్లా మెలిగిన నేతలు ప్రస్తుతం ఒకే గొడుగు కిందికి చేరారు.

Published : 08 May 2024 03:39 IST

రాజకీయంలో శాశ్వత శత్రువులు.. మిత్రులుండరు. కుత్బుల్లాపూర్‌ సెగ్మెంట్‌లో పలువురు నేతల వ్యవహారం దీనికి అద్దం పట్టేలా మారింది. మొన్నటి వరకు  కత్తులు దూసుకుని.. ఆగర్భ శత్రువుల్లా మెలిగిన నేతలు ప్రస్తుతం ఒకే గొడుగు కిందికి చేరారు. వారు తమ అభ్యర్థి విజయం కోసం సమైక్యంగా ‘చేయి.. చేయి’ కలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌.. కాంగ్రెస్‌ నుంచి కొలను హనుమంతరెడ్డి బరిలో నిలిచి పరాజయం పొందారు. వారి మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. ఇరువురు పలుమార్లు బహిరంగంగానే పరస్పర దూషణలు చేసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితులు తలకిందులయ్యాయి. తాజాగా జరిగిన పరిణామంలో కూన శ్రీశైలంగౌడ్‌ భాజపాను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కొలను హనుమంతరెడ్డి వ్యవహరిస్తున్నారు.

న్యూస్‌టుడే, నిజాంపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు