logo

హామీలు అమలు చేసి తీరతాం: కాంగ్రెస్‌

పరిగి, కొడంగల్‌ పక్కపక్కనే ఉన్నాయి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నేను (ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి) తోడు పెళ్లి కొడుకుని. ఆయనకు వచ్చే లడ్డూ (అభివృద్ధి ఫలాల్లో)ల్లో నాకు ఎక్కువగానే అందుతాయి. వాటిని మీకు తినిపించడానికి అవకాశం కలుగుతుందని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

Published : 08 May 2024 03:45 IST

సభాస్థలిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యేలు బుయ్యని, రామ్మోహన్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు

దోమ: పరిగి, కొడంగల్‌ పక్కపక్కనే ఉన్నాయి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నేను (ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి) తోడు పెళ్లి కొడుకుని. ఆయనకు వచ్చే లడ్డూ (అభివృద్ధి ఫలాల్లో)ల్లో నాకు ఎక్కువగానే అందుతాయి. వాటిని మీకు తినిపించడానికి అవకాశం కలుగుతుందని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం దోమ మండలం మోత్కూర్‌, కొండాయపల్లి, గంజిపల్లి అనుబంధ తండాల ప్రజలతో బడెంపల్లిలో రోడ్‌షో నిర్వహించి మాట్లాడారు. ఇచ్చిన మాట మేరకు హామీలన్నీ అమలుచేస్తామన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్‌ మాజీ ఛైర్మన్‌ ప్రదీప్‌రెడ్డి పాల్గొన్నారు.

లక్ష మందితో ప్రియాంక గాంధీ సభ 

తాండూరు: తాండూరులో ఈనెల 11న మధ్యాహ్నం 12 గంటలకు లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. తాండూరులోని  విలియమ్‌మూన్‌ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి మంగళవారం సాయంత్రం పరిశీలించి మాట్లాడారు. బహిరంగ సభకు ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు హాజరౌతారని తెలిపారు. కార్యక్రమంలో  రాష్ట్ర ఓబీసీ కన్వీనర్‌ సునీత, తాండూరు మున్సిపల్‌ అధ్యక్షురాలు స్వప్న తదితరులు పాల్గొన్నారు.

కుల సంఘాల అభివృద్ధికి కృషి: బుయ్యని

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: కుల సంఘాల అభివృద్ధికి కృషి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తెలిపారు. కురుమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణ పరిధిలో సన్మాన సమావేశం నిర్వహించారు. సంఘం సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పెద్దేముల్‌ జడ్పీటీసీ దారాసింగ్‌, సంఘం నాయకులు హన్మప్ప, నాగప్ప, మల్లికార్జున్‌, మహిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
యాలాల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీతోనే సంక్షేమ పథకాలు సాధ్యమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోకట్‌, విశ్వనాథ్‌పూర్‌, బషీర్‌మియా తండా, బామ్లా నాయక్‌ తండాలకు చెందిన భారాస నాయకులు పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్‌లు అశోక్‌, జోగు కృష్ణ, ఉపసర్పంచ్‌ శరణప్ప, నరేష్‌, మాజీ ఎంపీటీసీ హన్మప్ప తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు