logo

అవినీతిలో భారాస, కాంగ్రెస్‌ ఒకటే

అవినీతిలో భారాస, కాంగ్రెస్‌ల మధ్య తేడా ఏమీ లేదని తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై అన్నారు. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం రాత్రి ఫోరం ఫర్‌ ఐటీ ఎంప్లాయీస్‌ (ఫైట్‌) ఆధ్వర్యంలో అన్నామలై, చేవెళ్ల లోక్‌సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో లెట్స్‌ యునైట్‌ వికసిత్‌ భారత్‌ పేరుతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.

Published : 08 May 2024 03:47 IST

ముఖాముఖిలో తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై, చేవెళ్ల అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి 

రాయదుర్గం, న్యూస్‌టుడే: అవినీతిలో భారాస, కాంగ్రెస్‌ల మధ్య తేడా ఏమీ లేదని తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై అన్నారు. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం రాత్రి ఫోరం ఫర్‌ ఐటీ ఎంప్లాయీస్‌ (ఫైట్‌) ఆధ్వర్యంలో అన్నామలై, చేవెళ్ల లోక్‌సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో లెట్స్‌ యునైట్‌ వికసిత్‌ భారత్‌ పేరుతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రధాని మోదీ దార్శనికతతో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని చెప్పారు. అవినీతికి తావు లేకుండా పాలన అందిస్తున్న ఘనత ఆయనదన్నారు. చేవేళ్ల పార్లమెంట్‌ పరిధి అటు గ్రామీణ, ఇటు శేరిలింగంపల్లి వంటి ఆధునిక ప్రాంతాల కలిసి ఉందని, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. మోదీ సంస్కరణలతో ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ లాభాల బాటలో పయనిస్తున్నాయని చెప్పారు.పార్టీ నేత రవికుమార్‌ యాదవ్‌, విశ్వేశ్వర్‌రెడ్డి సతీమణి సంగీతారెడ్డి, ఆయన సోదరి అనితారెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు