logo
Published : 06 Dec 2021 03:18 IST

108 సేవలు భేష్‌...

గర్భిణులకు ఉపయోగం ఆధునిక పరికరాల సాయం

వల్లూరుకు చెందిన ఓ గర్భిణకిి ఇటీవల అర్ధరాత్రి సమయంలో నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాన్పు కష్టమవుతుందని వైద్యులు సూచించారు. 108లో కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పులు అధికమవ్వడంతో సిబ్బంది ఈఎంటీ కొండయ్య, పైలెట్‌ రఘునాథరెడ్డి అంబులెన్స్‌లో సురక్షితంగా కాన్పు చేసి తల్లీబిడ్డను క్షేమంగా కడప సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు.

.కమలాపురం, పులివెందుల, న్యూస్‌టుడే జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు 108 వాహనం అపర సంజీవనిలా సేవలందిస్తోంది. అనార్యోగానికి గురై అత్యవసర చికిత్స అవసరమైన వారికి ఊపిరిలూదుతోంది. ప్రధానంగా గర్భిణులకు విశేష సేవలందిస్తూ అత్యవసరమైన వారికి పురుడు కూడా పోస్తున్నారు. జిల్లాలో అరబిందో సంస్థ 2020 జులై నుంచి 108 వాహనాల నిర్వహణ చేపట్టింది. కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, రాజంపేట, పులివెందులతో డివిజన్ల వారీగా వాహనాలు కేటాయించారు. నిత్యం పల్లెలు, మండల కేంద్రాల్లో వాహనాలు తిరుగుతూ సేవలందిస్తున్నాయి.

లింగాల మండల కేంద్రానికి చెందిన ఓ మహిళకు రాత్రి 10 గంటల సమయంలో నొప్పులు రావడంతో 108లో రిమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఆమెకు అత్యవసర పరిస్థితితో ప్రసవం చేసి సురక్షితంగా ఆసుపత్రిలో చేర్పించారు.

ఆరు మందికి ప్రసవం చేశాం

నేను కమలాపురం 108 అంబులెన్సులో పని చేస్తున్నా. ఆరు నెలల కాలంలో ఆరు మందికి ప్రసవం చేశాం. నొప్పులు వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా సమాచారం ఇస్తే వాహనంలో వెళ్లి ఆసుపత్రిలో చేరుస్తాం. కొంత మందికి అత్యవసరంగా కాన్పు చేయాల్సి వస్తే మేమే చేస్తున్నాం. 108లో ఆధునిక పరికాలు ఉండటంతో ప్రసవాలు చేయగలుగుతున్నాం. - జీవరత్నం, ఈఎంటీ

అవగాహన పెరగాలి

అనారోగ్యానికి గురైన ప్రతి ఒక్కరూ 108ను ఉపయోగించుకోవాలి. చాలా మందికి సరైన అవగాహన లేకపోవడంతో సొంత వాహనాల్లో వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి నెలలోపు పిల్లలను వెంటిలేటర్‌పై ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి 108 వాహనాలు ఉపయోగపడతాయి. వరదల సహాయ కార్యక్రమాల్లో అయిదు 108 వాహనాలు, ఏడు 104 వాహనాల ద్వారా మెడికల్‌ క్యాంపులు నిర్వహించి వైద్య సేవలు అందించాం.- జి.నాగరాజు, 108 జిల్లా మేనేజరు, కడప

జిల్లాలో మొత్తం అంబులెన్సులు 54

రోజుకు సగటున తిరిగే దూరం 245 కిలో మీటర్లు

టెక్నీషియన్స్‌ 131

పైలెట్స్‌ 123

2020 జులై నుంచి ఇప్పటి వరకు ఆసుపత్రులకు రెఫర్‌ చేసినవారు 82,435 మంది

108లో ప్రసవాలు 380

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని