logo

రూ.5.13 కోట్లతో పొలతలకు పూర్వ వైభవం

జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పొలతలకు పూర్వ వైభవం రానుంది. మల్లేశ్వరస్వామి సన్నిధిలో అభివృద్ధి పనులకు సీజీఏఫ్‌, దేవస్థానం నిధులు రూ.5.13 కోట్లు మంజూరయ్యాయని దేవాదాయశాఖాధికారులు తెలిపారు. దేవస్థానం నిధులు రూ.38 లక్షలతో దుకాణాల

Published : 21 Jan 2022 01:56 IST

పొలతలలో నిర్మాణంలో ఉన్న అక్కదేవతల ఆలయం

పెండ్లిమర్రి, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పొలతలకు పూర్వ వైభవం రానుంది. మల్లేశ్వరస్వామి సన్నిధిలో అభివృద్ధి పనులకు సీజీఏఫ్‌, దేవస్థానం నిధులు రూ.5.13 కోట్లు మంజూరయ్యాయని దేవాదాయశాఖాధికారులు తెలిపారు. దేవస్థానం నిధులు రూ.38 లక్షలతో దుకాణాల సముదాయం, రూ.22 లక్షలతో కార్యాలయం భవనం, రూ.2.50 లక్షలతో గోశాలకు కంచె నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ.6.50 లక్షల అంచనా వ్యయంతో పర్యాటక భవనం, శివుని విగ్రహం, మరుగుదొడ్లు, నీటి ట్యాంకు తదితర వాటికి రంగులు వేశారు. సీజీఏఫ్‌, దేవస్థానం నిధులు రూ.1,40,20,000 అంచనా వ్యయంతో అక్క దేవతలు, బండెన్న స్వామి, పుట్టాంజనేయస్వామి ఆలయాల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. దేవస్థానం నిధులతో మల్లేశ్వరస్వామి ఆలయం ముందు రాజగోపురం నిర్మాణానికి రూ.2 కోట్లు, ఆలయం ముందు ప్రాకారం విస్తరణ పనులకు రూ.1.04 కోట్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఆలయాల నిర్మాణ పనులు మహాశివరాత్రి పర్వదినానికి ముందే పూర్తి చేసేందుకు శరవేగంగా పనులు చేపడుతున్నారు. రాజగోపురం, ప్రాకారం విస్తరణ పనులకు త్వరలోనే టెండర్లు నిర్వహిస్తామని ఆలయ ఈవో మహేశ్వర్‌రెడ్డి, ఛైర్మన్‌ ఎ.రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని