logo

అయిదుగురు అంతర్‌ జిల్లా గంజాయి ముఠా అరెస్టు

గంజాయి విక్రయిస్తున్న అయిదుగురు అంతర్‌ జిల్లా ముఠాను వైయస్‌ఆర్‌ జిల్లా దువ్వూరు పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలున్నారు. వీరి నుంచి రూ.4.40 లక్షలు విలువ చేసే 5.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిని బుధవారం ఎస్పీ అన్బురాజన్‌ తన కార్యాలయంలో మీ

Published : 19 May 2022 03:54 IST

రూ.4.40 లక్షలు విలువ చేసే 5.5 కిలోల గంజాయి స్వాధీనం

అంతర్‌ జిల్లా గంజాయి స్మగ్లర్ల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: గంజాయి విక్రయిస్తున్న అయిదుగురు అంతర్‌ జిల్లా ముఠాను వైయస్‌ఆర్‌ జిల్లా దువ్వూరు పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలున్నారు. వీరి నుంచి రూ.4.40 లక్షలు విలువ చేసే 5.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిని బుధవారం ఎస్పీ అన్బురాజన్‌ తన కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో ఇటీవల కాలంలో గంజాయి అక్రమ రవాణా అవుతున్న దృష్ట్యా కట్టడి చేయాలని ఆయా డివిజన్ల పోలీసులను ఆదేశించాం. అందులో భాగంగా మైదుకూరు డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌, మైదుకూరు గ్రామీణ సీఐ నరేంద్రరెడ్డి గంజాయి అక్రమ రవాణాపై నిఘా ఉంచారు. వీరికి దువ్వూరు మండలం కృష్ణంపల్లె గ్రామ సమీపంలోని జమాలయ్య స్వామి దర్గా వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి వారిపై దాడులు చేశారు. ఈ దాడుల్లో నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం, అయ్యవారికోడూరు గ్రామానికి చెందిన షేక్‌ కైరూన్‌బీ, షేక్‌ హుస్సేన్‌బాషా, అబ్దుల్‌ నూర్జహాన్‌, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామానికి చెందిన పగడాల శివుడు, పగడాల మహేష్‌ను అరెస్టు చేసి వారి నుంచి రూ.4.40 లక్షలు విలువ జేసే 5.5 కిలోల గంజాయిని స్వాధీనపరచుకున్నారు. అరెస్టైన వారిలో షేక్‌ కైరూన్‌ బీపై నంద్యాలలో కూడా గంజాయి కేసులున్నాయి. వీరు దువ్వూరు, పోరుమామిళ్ల ప్రాంతాల్లో గంజాయి విక్రయించేవారు. వీరిచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఈ కేసును ఛేదిచిన పోలీసులకు ఎస్పీ నగదు బహుమతి అందజేశారు. దువ్వూరు ఎస్సై కేసీ రాజు, సిబ్బంది ఓబులేసు, వెంకటసుబ్బమ్మ, బాబా ఫకృద్దీన్‌, సంతోష్‌రెడ్డి తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని