logo

డీఎస్‌ఏ ఆవరణలో టెన్నిస్‌ కోర్టు ప్రారంభం

కడప నగరంలోని డీఎస్‌ఏ ఆవరణంలో నూతనంగా నిర్మించిన టెన్నిస్‌ కోర్టు ఎట్టకేలకు ప్రారంభమైంది. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) మాలోల ముఖ్య అతిథిగా హాజరై బుధవారం టెన్నిస్‌ కోర్టును ప్రారంభించారు. టెన్నిస్‌ క్రీడాంశంలో క్రీడాకారులను అత్యుత్తమంగా తయారు చేసి

Published : 19 May 2022 03:54 IST


టెన్నిస్‌ కోర్టును ప్రారంభిస్తున్న డీఆర్‌వో మాలోల, చిత్రంలో స్టెప్‌ బాధ్య సీఈవో రామచంద్రారెడ్డి

కడప క్రీడలు, న్యూస్‌టుడే: కడప నగరంలోని డీఎస్‌ఏ ఆవరణంలో నూతనంగా నిర్మించిన టెన్నిస్‌ కోర్టు ఎట్టకేలకు ప్రారంభమైంది. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) మాలోల ముఖ్య అతిథిగా హాజరై బుధవారం టెన్నిస్‌ కోర్టును ప్రారంభించారు. టెన్నిస్‌ క్రీడాంశంలో క్రీడాకారులను అత్యుత్తమంగా తయారు చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడేలా తీర్చిదిద్దాలని నిర్వాహకులకు సూచించారు. స్టెప్‌ బాధ్య సీఈవో ఎం.రామచంద్రారెడ్డి, డాక్టర్‌ మల్లికార్జునరెడ్డి, డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ అమృత్‌రాజు, టెన్నిస్‌ కోచ్‌ మురళీధర్‌రెడ్డి, డీఎస్‌ఏ శిక్షకులు, సిబ్బంది, సీనియర్‌ టెన్నిస్‌ క్రీడాకారులు, పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని