logo
Published : 28/11/2021 02:59 IST

కొండగట్టు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

ఎమ్మెల్సీ కవిత

భేతాళస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్న కవిత, చిత్రంలో ఎమ్మెల్యే రవిశంకర్‌

మల్యాల, న్యూస్‌టుడే: ఏ కొండ ఎక్కినా..ఏ బండ మొక్కినా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమేనని.. దేవాలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కొండగట్టు అంజన్న భక్తుల పాలిట కొంగు బంగారమని, ఎన్నిసార్లు స్వామివారిని దర్శించుకున్నా మళ్లీమళ్లీ రావాలనిపిస్తుందన్నారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అంజన్న దయతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కరోనా సమయంలో కొండపైన హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించి రామకోటి స్తూపం నిర్మాణాన్ని ప్రారంభించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం యాగం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కొండగట్టులో మాస్టర్‌ప్లాను అమలు, భక్తులకు సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. తనను ఏకగ్రీవంగా గెలిపించిన కామారెడ్డి, నిజామాబాద్‌ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రవిశంకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని వివరించారు. ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ అమలుపర్చి భక్తులకు సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. స్వామి వారి దర్శనం తర్వాత రామకోటి స్తూపం నిర్మాణ పనులు పరిశీలించారు. జడ్పీ ఛైర్‌సర్సన్‌ వసంత, గ్రంథాలయ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, మల్యాల ఎంపీపీ విమల, జడ్పీటీసీ సభ్యుడు రాంమోహన్‌రావు, సర్పంచి తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ సామల రేణుక, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సుదర్శన్‌, సింగిల్విండో అధ్యక్షులు రాంలింగారెడ్డి, రాజనర్సింగారావు, సాగర్‌రావు, మండల తెరాస అధ్యక్షుడు శ్రీనివాస్‌, రైత బంధు అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు సుబాన్‌, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. డీఎస్పీ ప్రకాశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని