logo

డంపింగ్‌యార్డులో మంటలు

నగరంలోని డంపింగ్‌యార్డు నుంచి మళ్లీ మంటలు అంటుకున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి చెత్త కాలుతుండటంతో దట్టమైన పొగ వ్యాపించింది. మానేరు నది భాగం నుంచి మంటలు అంటుకుంటుండటంతో జెట్టింగ్‌ మిషన్‌తో నీటిని చల్లిస్తూ,

Published : 26 May 2022 04:07 IST

మానేరు నది వైపు ఎగిసి పడుతున్న మంటలు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: నగరంలోని డంపింగ్‌యార్డు నుంచి మళ్లీ మంటలు అంటుకున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి చెత్త కాలుతుండటంతో దట్టమైన పొగ వ్యాపించింది. మానేరు నది భాగం నుంచి మంటలు అంటుకుంటుండటంతో జెట్టింగ్‌ మిషన్‌తో నీటిని చల్లిస్తూ, ఇసుక పోయడంతో కొంతమేర మంటలు తగ్గినట్లు చెబుతున్నప్పటికీ, గాలి వీస్తుండటంతో పూర్తిస్థాయిలో చల్లారడం లేదు. అగ్నిమాపక యంత్రంతో కూడా నీటిని చల్లించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మంటలు వ్యాపించకుండా, పొగ రాకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ¥ బయోమైనింగ్‌ ప్రారంభించడంలో ఆలస్యం చేస్తుండటంతో ఆ ప్రాంతవాసులు అవస్థలు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని