logo

కాంగ్రెస్‌ గెలుపు జిల్లాకు అవసరం

కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేందర్‌రావు గెలిస్తే.. జిల్లా మరింత అభివృద్ధిని సాధించేందుకు అవకాశముంటుందని, భాజపా, భారాస అభ్యర్థుల గెలుపుతో ప్రయోజనం ఏమీ ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

Published : 08 May 2024 05:03 IST

మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌, చిత్రంలో ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్‌, కవ్వంపల్లి, అభ్యర్థి రాజేందర్‌రావు,

కరీంనగర్‌ పట్టణం, సుభాష్‌నగర్‌, న్యూస్‌టుడే: కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేందర్‌రావు గెలిస్తే.. జిల్లా మరింత అభివృద్ధిని సాధించేందుకు అవకాశముంటుందని, భాజపా, భారాస అభ్యర్థుల గెలుపుతో ప్రయోజనం ఏమీ ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల మైదానంలో వర్షం కారణంగా రద్దైన పార్టీ అధినేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి సభావేదికపై సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే కొత్త రేషన్‌కార్డులు, రూ.4 వేల పింఛన్లు ఇస్తాం. కోహినూర్‌ కరీంనగర్‌గా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్‌ వెలిచాల రాజేందర్‌రావు పక్కా ప్రణాళికతో ప్రజల ముందుకొస్తున్నారు. భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఇప్పటివరకు సంపాదించిన రూ.కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. ఈనెల 11 వరకు ప్రచార సభలు నిర్వహించే అవకాశముండటంతో కాంగ్రెస్‌ అధినేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలను ఆహ్వానిస్తాం. వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. అలాగే కాంగ్రెస్‌ విజయానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.’’ అని అన్నారు.

భాజపాను ఓడించాలి..: భాకపా జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో భాజపాను ఓడించడంతో ప్రజాస్వామ్యం కాపాడబడుతుందన్నారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుకు పార్టీ అభ్యర్థికి ప్రజలు విజయం చేకూర్చాలన్నారు. కరీంనగర్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు,  డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణగౌడ్‌, ఆరెపల్లి మోహన్‌, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు