logo

కళాశాల కావాలని కారటగికి పాదయాత్ర

తాలూకాలోని బూదగుంపకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంజూరు చేయాలని డిమాండు చేస్తూ బూదగుంప, హాలసముద్ర, తిమ్మాపుర గ్రామాల ప్రజలు సోమవారం కారటగి వరకు పాదయాత్ర నిర్వహించారు. కారటగి చేరుకున్న వారు గంగావతి - రాయచూరు మార్గంలోని

Published : 25 Jan 2022 04:37 IST


కారటగి కనకదాస కూడలిలో బైఠాయించిన ఆందోళనకారులు

కారటగి, న్యూస్‌టుడే: తాలూకాలోని బూదగుంపకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంజూరు చేయాలని డిమాండు చేస్తూ బూదగుంప, హాలసముద్ర, తిమ్మాపుర గ్రామాల ప్రజలు సోమవారం కారటగి వరకు పాదయాత్ర నిర్వహించారు. కారటగి చేరుకున్న వారు గంగావతి - రాయచూరు మార్గంలోని కనకదాస కూడలిలో కొంతసేపు బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ నాయకులు మాట్లాడుతూ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ముందుచూపుతో కళాశాల కోసం 2.29 ఎకరాల భూమిని కేటాయించాం. ప్రభుత్వం ఇటీవల మంజూరుచేసిన కళాశాలల్లో బూదగుంప పేరు లేదు. ఈ విషయమై మూడు గ్రామాల ప్రజలకు అన్యాయం జరిగింది. కళాశాల మంజూరు చేయకపోతే జిల్లా పాలనాధికారి కార్యాలయం వరకు పాదయాత్ర చేపడతామన్నారు. గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, సభ్యులు, విద్యార్థులు, వివిధ సంఘాలు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని