logo

పెట్టుబడులకు చక్కని వేదిక ఒడిశా

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒడిశా ముందు వరుసలో ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు. గడచిన ఒకటిన్నర దశాబ్దంలో జాతీయ సగటు కన్నా తాము ముందంజలో ఉన్నామని తెలిపారు.

Published : 29 Sep 2022 02:20 IST

మేక్‌ఇన్‌ ఒడిశా వేదికపై నవీన్‌ పట్నాయక్‌, అధికారులు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒడిశా ముందు వరుసలో ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు. గడచిన ఒకటిన్నర దశాబ్దంలో జాతీయ సగటు కన్నా తాము ముందంజలో ఉన్నామని తెలిపారు. ‘మేక్‌ ఇన్‌ ఒడిశా’ పేరిట బెంగళూరులో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నవంబరు 30 నుంచి డిసెంబరు 4 వరకు భువనేశ్వర్‌లో నిర్వహించే పెట్టుబడిదారుల సదస్సుకు దేశ, విదేశాల నుంచి పెట్టుబడిదారులు వస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. సమావేశంలో కర్ణాటక వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి కె.ఉల్లాస్‌ కామత్‌, ఒడిశా అధికారులు హేమంత్‌ శర్మ, మనోజ్‌ కుమార్‌ మిశ్రా, డాక్టర్‌ ఓంకార్‌ రాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని