logo

గనినాడులో సర్వం సిద్ధం

 బళ్లారి లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని కంప్లి, బళ్లారి నగర, గ్రామీణ, సండూరు విధానసభ నియోజకవర్గాల సంబంధించిన పోలింగ్‌ సిబ్బందికి సోమవారం ఓటింగ్‌ యంత్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు.

Published : 07 May 2024 03:20 IST

ఓటింగ్‌ యంత్రాలతో పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తున్న అధికారులు

బళ్లారి, న్యూస్‌టుడే:  బళ్లారి లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని కంప్లి, బళ్లారి నగర, గ్రామీణ, సండూరు విధానసభ నియోజకవర్గాల సంబంధించిన పోలింగ్‌ సిబ్బందికి సోమవారం ఓటింగ్‌ యంత్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన అధికారులు, సిబ్బంది హాజరు పనులు పూర్తి చేసుకుని బస్సుల్లో కేంద్రాలకు చేరుకున్నారు.  కంప్లి విధానసభ నియోజకవర్గానికి సంబంధించిన సిబ్బంది   హాజరును కంటోన్మెంట్‌లోని సెయింట్‌ ఫిలోమినా పాఠశాల  ఆవరణలో, బళ్లారి గ్రామీణ విధానసభ నియోజకవర్గ సిబ్బంది హాజరును బళ్లారి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో, బళ్లారి నగర విధానసభ నియోజకవర్గ సిబ్బంది హాజరును   కోటె ప్రదేశంలోని సెయింట్‌ జాన్స్‌ ఉన్నత పాఠశాల,    పదవీ పూర్వ కళాశాలలో నిర్వహించారు. పోలీసులు, సీఆర్పీఎఫ్‌ జవాన్లు, ఎన్నికల సిబ్బంది, పోలింగ్‌ కేంద్రాల భద్రత    సిబ్బంది, హోంగార్డులు తరలివచ్చారు. పోలింగ్‌ సిబ్బందిని తీసుకుని వెళ్లడానికి బస్సు సర్వీసులు, క్రూజర్లు, తదితర వాహనాలు ఉదయం 6 గంటలకే కేంద్రాలకు చేరుకున్నాయి.

తరలిన సిబ్బంది

 పోలింగ్‌ కేంద్రాల అధికారులు, సిబ్బంది ఎన్నికల సామగ్రి, ఈవీఎంలు, వీవీప్యాట్‌ యంత్రాలు, విశేష కిట్‌ బ్యాగ్‌తో పాటు ఆరోగ్య కిట్లను అందజేశారు. వాటిని అక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద సరిచేసుకున్నారు. అధికారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా  ఉన్నతాధికారులు ముందు జాగ్రత్తగా మైకులో ప్రకటనలు  చేస్తూ సహకరించారు. బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం    ఎన్నిక హాజరును పరిశీలకులు చంద్రశేఖర్‌ సఖమురి,       జిల్లా   ఎన్నికల అధికారి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా తదితర అధికారులు స్థానిక కోటె ప్రదేశంలోని సెయింట్‌ జాన్స్‌ ఉన్నత పాఠశాల, పదవీ పూర్వ కశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, సెయింట్‌ ఫిలోమీనా పాఠశాల కేంద్రాలను పరిశీలించారు.

  • జిల్లాలో మొత్తం 1219 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కంప్లి-242, సిరుగుప్ప-228, బళ్లారి గ్రామీణ-235, బళ్లారి నగర- 261, సండూరు-253 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 299 సూక్ష్మ, 69 అతి సూక్ష్మ కేంద్రాలను గుర్తించారు. బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 1972 పోలింగ్‌ కేంద్రాలకుగాను 2506 బ్యాలెట్‌ యూనిట్లు, 2767 కంట్రోల్‌ యూనిట్లు, 2630 వీవీప్యాట్లను సిద్ధం చేశారు.
  • బళ్లారి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు మొత్తం 5,952 మంది అధికారులు, సిబ్బందిని ఉపయోగించుకుంటున్నారు. 1,395 మంది పీఆర్వోలు, 1395 మంది ఏపీఆర్వోలు, 2790 మంది పీవోలు, 372 సూక్ష్మ పరిశీలకులు, సిబ్బందిని నియమించినట్లు ఎన్నికల అధికారి వివరించారు. కంప్లి-1183, సిరుగుప్ప-1097, బళ్లారి గ్రామీణ-1195, బళ్లారి నగర-1261, సండూరు-1215 మంది సిబ్బంది, అధికారులను నియమించినట్లు చెప్పారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని