logo

శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను బెదిరించిన మాజీ కౌన్సిలర్‌

శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రాధాకృష్ణతో మాజీ కౌన్సిలర్‌ యలమందల వాసు బుధవారం స్థానిక పురపాలక కార్యాలయంలో అధికారులు, సిబ్బంది సాక్షిగా తీవ్ర వాగ్వాదానికి దిగారు.

Published : 01 Jun 2023 03:01 IST

ఇల్లెందు, న్యూస్‌టుడే: శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రాధాకృష్ణతో మాజీ కౌన్సిలర్‌ యలమందల వాసు బుధవారం స్థానిక పురపాలక కార్యాలయంలో అధికారులు, సిబ్బంది సాక్షిగా తీవ్ర వాగ్వాదానికి దిగారు. ‘కళావతి’ పేరుతో 2020 నుంచి 2023 వరకు ఉన్న ట్రేడ్‌ లైసెన్స్‌ పత్రం కావాలని కొందరు భారాస నాయకులతో కలిసి వాసు ఈ నెల 17న శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు దరఖాస్తు చేశారు. రికార్డులు పరిశీలించి ఇస్తామని సదరు అధికారి చెప్పారు. కొద్దిరోజులు అనారోగ్యంతో సెలవులో ఉండటంతో ఆలస్యమైంది. ఆ సమయంలో దరఖాస్తుదారుడు పలుమార్లు కార్యాలయానికి వచ్చివెళ్లారు. బుధవారం మళ్లీ రావడంతో కొంత సమయమిస్తే పనిపూర్తిచేస్తానని రాధాకృష్ణ బదులిచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన మాజీ కౌన్సిలర్‌ అధికారిని అసభ్యపదజాలంతో దూషించారు. ‘సంగతి చూస్తా’నని బెదిరించాడు. ఇరువురి మధ్య కొంతసేపు వాగ్వాదం నడిచింది. వెంటనే కౌన్సిలర్లు వాసును బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనతో అధికారి కంటతడిపెట్టారు. ఆయన్ను కార్యాలయ ఉద్యోగులు, పనుల కోసం వచ్చిన స్థానికులు ఓదార్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని