logo

చట్టసభల్లో మన నాగేశ్వరరావులు

ఖమ్మం జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి నలుగురు నాగేశ్వరరావులు చట్టసభలకు ఎన్నికై కీలక పదవులు చేపట్టి పాలనలో తమదైన ముద్ర వేశారు.

Updated : 04 Nov 2023 06:42 IST

మధిర, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి నలుగురు నాగేశ్వరరావులు చట్టసభలకు ఎన్నికై కీలక పదవులు చేపట్టి పాలనలో తమదైన ముద్ర వేశారు. వీరిలో కమ్యూనిష్టు భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చిన పువ్వాడ నాగేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2007లో స్థానిక సంస్థల నుంచి 1981లో ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989, 1994లో ఖమ్మం నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభలో ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేశారు.

కోనేరు

కొత్తగూడెం నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా కోనేరు నాగేశ్వరరావు 1983, 1985, 1994లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1988లో తెదేపా ప్రభుత్వంలో చిన్ననీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేసి గుర్తింపు పొందారు.

తుమ్మల

తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 1985, 1994, 1999, ఖమ్మం నియోజకవర్గం నుంచి 2009లో, 2016లో పాలేరు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2015లో తెరాసలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెదేపా ప్రభుత్వంలో 1985-88 కాలంలో చిన్ననీటి పారుదలశాఖ మంత్రి, 1994-99లో చిన్ననీటిపారుదల, ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా, 1999 నుంచి 2004 వరకు భారీ నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. తెరాస ప్రభుత్వంలో 2015 నుంచి 2018 వరకు స్త్రీ శిశు సంక్షేమశాఖ, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు.

నామా

నామా నాగేశ్వరరావు ఖమ్మం పార్లమెంట్‌ స్థానం నుంచి 2009, 2019లలో పోటీచేసి గెలుపొందారు. లోక్‌సభాపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో తన వాణి విన్పించారు.

పువ్వాడ

స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోట్ల నాగేశ్వరరావు గెలుపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని