logo

పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్‌ ఆదేశం

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో   పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని  కలెక్టర్‌ గౌతమ్‌ అధికారులను గురువారం ఆదేశించారు.

Published : 26 Apr 2024 02:51 IST

ఖమ్మం నగరం: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో   పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని  కలెక్టర్‌ గౌతమ్‌ అధికారులను గురువారం ఆదేశించారు. పోలింగ్‌ ముగిసే వరకు పంచాయతీ కార్యాలయాలు వేరేచోటుకు తరలించాలని చెప్పారు. కల్లూరు, వేంసూరు  మండలాల్లో 6, కామేపల్లి, ఏన్కూరు మండలాల్లో 5, నేలకొండపల్లి, పెనుబల్లి మండలాల్లో 3, మధిర, తిరుమలాయపాలెం, వైరా, చింతకాని మండలాల్లో 2, ముదిగొండ, ఖమ్మం గ్రామీణం, రఘునాథపాలెం, సత్తుపల్లి, సింగరేణి, తల్లాడ, ఎర్రుపాలెం మండలాల్లో ఒక్కోటి చొప్పున పంచాయతీ కార్యాలయాలను ఖాళీచేయాలని పేర్కొన్నారు. ఈమేరకు సంబంధిత ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు చర్యలు చేపట్టాలని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని