logo

దళ కమాండర్‌కు 3 ఏళ్లు జైలు శిక్ష, 10 వేల జరిమానా

ఇల్లందు మండలం కొమరారంలో 2018 సంవత్సరంలో పోలీసుల వాహనాల తనిఖీల్లో అనుమానాస్పద స్థితిలో పట్టుబడిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలానికి చెందిన భోగి భద్రయ్య వద్ద ఒక రివాల్వర్ పట్టుబడింది.

Published : 10 May 2024 18:53 IST

ఇల్లందు గ్రామీణం: ఇల్లందు మండలం కొమరారంలో 2018 సంవత్సరంలో పోలీసుల వాహనాల తనిఖీల్లో అనుమానాస్పద స్థితిలో పట్టుబడిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలానికి చెందిన భోగి భద్రయ్య వద్ద ఒక రివాల్వర్ పట్టుబడింది. అతనిని విచారించగా దళ కమండర్‌గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఇల్లందు న్యాయస్థానంలో జరిగిన విచారణలో జ్యూడిషయల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కీర్తి చంద్రిక రెడ్డి భద్రయ్యకు 3 సంవత్సరాల జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమాన విధించారు. నేరస్తుడికి శిక్ష పడే విధంగా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్, రచితను, కోర్ట్ కానిస్టేబుల్ రామారావు, సీఐలు రవీందర్, దారం సురేశ్‌, ఎస్సైలు ప్రవీణ్ కుమార్, సోమేశ్వర్లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు