Andhra News: మనుగడ కోసం ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొట్టొద్దు: ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

ప్రశాంతతకు మారుపేరైన కోనసీమ జిల్లాలో విధ్వంసం జరగడం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష పార్టీలే ఈ విధ్వంసాన్ని సృష్టించాయని ఆరోపించారు. ప్రజల అభిప్రాయం మేరకే కోనసీమ జిల్లాను...

Updated : 25 May 2022 01:38 IST

అమరావతి: ప్రశాంతతకు మారుపేరైన కోనసీమ జిల్లాలో విధ్వంసం జరగడం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష పార్టీలే ఈ విధ్వంసాన్ని సృష్టించాయని ఆరోపించారు. ప్రజల అభిప్రాయం మేరకే కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేసినట్లు చెప్పారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు సైతం అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరినట్లు గుర్తుచేశారు. తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఎంతో హుందాగా వ్యవహరించే కోనసీమ ప్రజలు ఇటువంటి విధ్వంసాలకు పాల్పడరని.. కేవలం అరాచకం సృష్టించేందుకే అల్లర్లు సృష్టించారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం అమలాపురంలో ప్రశాంత వాతావరణం నెలకొందని.. ప్రతిపక్ష పార్టీలు తమ మనుగడ కోసం ప్రజలను రెచ్చగొట్టొద్దని కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని