logo

20న కలెక్టరేట్‌ ముట్టడి

ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల డిమాండ్ల సాధనలో భాగంగా ఈనెల 20న ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా ఛైర్మన్‌ కె.పోతరాజు, సెక్రటరీ జనరల్‌ కె.రాజేంద్రప్రసాద్‌ తెలిపారు

Updated : 18 Jan 2022 05:09 IST

బందరు: ఐక్యత చాటుతూ నినాదాలు చేస్తున్న నాయకులు

మచిలీపట్నం కార్పొరేషన్‌,న్యూస్‌టుడే: ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల డిమాండ్ల సాధనలో భాగంగా ఈనెల 20న ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా ఛైర్మన్‌ కె.పోతరాజు, సెక్రటరీ జనరల్‌ కె.రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. సోమవారం నగరంలోని యూటీఎఫ్‌ భవన్‌లో ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఆర్‌ కన్నా అధికంగా ఫిట్‌మెంట్‌ ఉండాలని, పాత హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లనే కొనసాగించాలని, ఉద్యోగ విరమణ వయస్సు 62 నుంచి 60 ఏళ్లకు మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రనాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహిస్తున్న కలెక్టరేట్‌ ముట్టడిలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కో-ఛైర్మన్లు ఎ.సుందరయ్య, మండవ శ్రీనివాస్‌, టి.నాగరాజుతో పాటు నాయకులు ఏఆర్‌ అస్లాం, బి.కనకారావు, సీహెచ్‌వీఎస్సార్‌ అశోక్‌కుమార్‌, ఎ.సుబ్రహ్మణ్యం, ఎమ్‌డీ మోమిన్‌, ఎ.రామ్‌గోపాల్‌,సీఐటీయూ నాయకులు టి.చంద్రపాల్‌, శ్రీనివాసరావు, జి.గోపాలరావు తదితరులు పాల్గొని ఐక్యత చాటుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

భాగస్వాములవుదాం’

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న ఉద్యమాల్లో ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బేతాళ రాజేంద్రప్రసాద్‌ కోరారు. ముదినేపల్లిలో సోమవారం జరిగిన సంఘ సమావేశంలో ఆయనతో పాటు సంఘ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని