logo

అతిథి అధ్యాపకుల నియామకానికి అనుమతి

జిల్లాలో 25 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 30 అతిథి అధ్యాపక ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. గతంలో రెగ్యులర్‌, ఒప్పంద అధ్యాపకుల నియామకం పూర్తయిన తర్వాత మిగిలిన ఖాళీల్లో అతిథి అధ్యాపకులను జులై, ఆగస్టు నెలల్లో నియమించేవారు. ఈసారి వీరి నియామకంలో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు

Published : 27 Jan 2022 05:42 IST

పెడనగ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో 25 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 30 అతిథి అధ్యాపక ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. గతంలో రెగ్యులర్‌, ఒప్పంద అధ్యాపకుల నియామకం పూర్తయిన తర్వాత మిగిలిన ఖాళీల్లో అతిథి అధ్యాపకులను జులై, ఆగస్టు నెలల్లో నియమించేవారు. ఈసారి వీరి నియామకంలో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు ప్రభుత్వం అతిథి అధ్యాపకుల నియామకానికి అనుమతి మంజూరు చేసింది. ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ ఎం.వి.శేషగిరిరావు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. వీరి నియామకం చేపట్టని కారణంగా ప్రస్తుతం పనిచేస్తున్న 30 మంది ఒప్పంద అధ్యాపకుల్ని ఈనెలలో మూడ్రోజులు వారు పనిచేస్తున్న కళాశాలలో, మరో మూడ్రోజులు డిప్యుటేషన్‌ పద్ధతిపై వేర్వేరు కళాశాలలకు సర్దుబాటు చేశారు. అతిథి అధ్యాపకులకు నెలకు రూ.10వేలకు మించకుండా వేతనాన్ని అందివ్వనున్నారు. ఆయా కళాశాలల సమీపంలో అందుబాటులో ఉండి అర్హత ఉన్న అభ్యర్థులకు అధ్యాపకులుగా అవకాశం కల్పిస్తారని ఆర్‌ఐవో పి.రవికుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని