logo

‘కొత్త జిల్లాలు.. ప్రగతికి బాటలు’

ప్రభుత్వం ప్రకటించిన 26 జిల్లాల ద్వారా రాష్ట్ర సమగ్ర ప్రగతి సాధ్యమని ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా గురువారం పెడనలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండు సెంటరులో ప్రారంభమైన ర్యాలీ బంటుమిల్లి రోడ్డు కూడలి

Published : 28 Jan 2022 02:17 IST

పెడన: ర్యాలీలో ఎమ్మెల్యే రమేష్‌, ఛైర్‌పర్సన్‌ జ్యోత్స్నారాణి తదితరులు

పెడన, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రకటించిన 26 జిల్లాల ద్వారా రాష్ట్ర సమగ్ర ప్రగతి సాధ్యమని ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా గురువారం పెడనలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండు సెంటరులో ప్రారంభమైన ర్యాలీ బంటుమిల్లి రోడ్డు కూడలి వరకు సాగింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కృష్ణాజిల్లాను మచిలీపట్నం, ఎన్టీఆర్‌ జిల్లాలుగా విభజించటంపై హర్షం వ్యక్తంచేశారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్‌ జిల్లా ద్వారా ప్రపంచ స్థాయిలో విజయవాడకు గుర్తింపు వస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బీజీఎల్‌ జ్యోత్స్నారాణి, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ గరికపాటి చారుమతి, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.అంజయ్య, మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ ఎండీ ఖాజా, ఫ్లోర్‌లీడర్‌ కటకం ప్రసాద్‌, జడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి, ఎంపీపీలు సంగా మధుసూదనరావు, రాజులపాటి వాణి, వైకాపా నాయకులు బళ్ల గంగయ్య, కొండవీటి నాగబాబు, గరికపాటి రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం చిత్రపటానికి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు.

తిరువూరు: నియోజకవర్గ కేంద్రమైన తిరువూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంపై వైకాపా శ్రేణుల ఆధ్వర్యంలో గురువారం సంబరాలు నిర్వహించారు. స్థానిక నియోజకవర్గ కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. అనంతరం పట్టణ ప్రధాన వీధుల్లో నిర్వహించిన కృతజ్ఞత ర్యాలీలో ఎమ్మెల్యే కె.రక్షణనిధి పాల్గొన్నారు. పలువురు వ్యాపారులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి సన్మానించారు. నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తిరువూరు: ఎమ్మెల్యే రక్షణనిధితో వ్యాపారులు​​​​​​​

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని