logo

ఓటర్ల జాబితా పరిశీలించండి

ఫొటో ఓటర్ల జాబితాల్లో డూప్లికేట్‌ నమోదులను సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్‌ రజింత్‌బాషా అధికారులకు సూచించారు. కలెక్టర్‌ బంగ్లాలో బుధవారం ఎన్నికల సహాయ

Published : 19 May 2022 03:14 IST

కలెక్టర్‌ రంజిత్‌బాషా

అధికారులకు సూచనలిస్తోన్న కలెక్టర్‌

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ఫొటో ఓటర్ల జాబితాల్లో డూప్లికేట్‌ నమోదులను సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్‌ రజింత్‌బాషా అధికారులకు సూచించారు. కలెక్టర్‌ బంగ్లాలో బుధవారం ఎన్నికల సహాయ రిటర్నింగ్‌ అధికాలు,, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల తహసీల్దార్లు, ఎన్నికల డీటీలతో సమావేశమయ్యారు. ఒకే ఓటరు ఫొటోతో రెండు మూడు ఎంట్రీ(ఫొటో సిమిలర్‌ ఎంట్రీ)లపై సమీక్షించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ఫొటో సిమిలర్‌ ఎంట్రీలు 73,353 ఉన్నట్లు గుర్తించిన విషయాన్ని ప్రస్తావించగా, వాటికి సంబంధించి నూరు శాతం పరిశీలన పూర్తయిందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఎన్‌ఆర్‌ఐలకు ఓటు హక్కు కల్పించే విషయంలో నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పారు. కొన్ని మండలాల్లో ఎలక్షన్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు, కొన్ని చోట్ల పీడీఎస్‌ డీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న విషయం తెలుసుకుని వాటి భర్తీకి చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లుకు సూచించారు. డీటీలకు పీడీఎస్‌ డీటీలుగా అదనపు బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. బందరు, గుడివాడ ఆర్డీవోలు కిషోర్‌, పద్మావతి, ముడ వీసీ నారాయణరెడ్డి, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్‌ హరనాథ్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని