logo

చిత్ర వార్తలు

హనుమాన్‌ జయంతి సందర్భంగా విజయవాడ బీఆర్ట్టీఎస్‌ రోడ్డులో విశ్వహిందూ పరిషత్‌, ఇతర హిందూ సంస్థల ఆధ్వర్యంలో శోభాయత్ర వైభవంగా సాగింది. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Published : 26 May 2022 05:10 IST

జై భజరంగ భళీ

నుమాన్‌ జయంతి సందర్భంగా విజయవాడ బీఆర్ట్టీఎస్‌ రోడ్డులో విశ్వహిందూ పరిషత్‌, ఇతర హిందూ సంస్థల ఆధ్వర్యంలో శోభాయత్ర వైభవంగా సాగింది. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మహిళలు బుల్లెట్లు నడుపుతూ సందడి చేశారు.

- ఈనాడు, అమరావతి


ఇండియా యూత్‌ గేమ్స్‌లో తలపడే రాష్ట్ర క్రీడాకారులతో క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ముఖాముఖి నిర్వహించారు. పతకాలు సాధించి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పలువురు విద్యార్థులు మాల్కంబ్‌పై చేసిన విన్యాసం ఆకట్టుకుంది. కార్యక్రమంలో శాప్‌ ఛైర్మన్‌ సిద్ధార్థరెడ్డి, ఎండీ ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బతుకు బండిపై కూలింది

విజయవాడ సాంబమూర్తి రోడ్డులో అకస్మాత్తుగా ఓ చెట్టు నుంచి భారీ కొమ్మ విరిగి అటుగా వెళుతున్న ఆటోపై పడింది. డ్రైవర్‌ ఉమ్మడిశెట్టి శ్రీనివాస్‌ స్వల్ప గాయాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆటో మాత్రం నుజ్జునుజ్జయింది. ట్రాఫిక్‌ పోలీసులు, నగరపాలకసంస్థ సిబ్బంది స్పందించి చెట్టు కొమ్మలను తొలగించారు.

- ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని