logo
Published : 04/12/2021 04:45 IST

అభివృద్ధికి మాముల్లు

 నిలిచిన రైల్వే పనులు


మద్దికెర రైల్వే స్టేషన్‌లో నిలిచిన పుట్‌ ఓవర్‌ బ్రిడ్జి పనులు

మద్దికెర, న్యూస్‌టుడే: మద్దికెర- గుంటూరు రైల్వే మార్గంలో చేపడుతున్న పనులకు ఆటంకం నెలకొంది. మద్దికెరలో రూ.50 లక్షలతో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి, రూ.19 కోట్లతో డోన్‌, బేతంచెర్ల, రంగాపురం, మల్కాపురం రైల్వేస్టేషన్ల పరిధిలో కొత్త స్టేషన్లు, ఇతర భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

రెండు చోట్లా ఆటంకమే

 బేతంచెర్ల ప్రాంతంలో పనులు ప్రారంభించగా అధికార పార్టీ నాయకుడు 10 శాతం పర్సంటేజీ ఇవ్వాలని హుకూం జారీ చేసినట్లు సమాచారం. చేసేదిలేక గుత్తేదారు పనులు ఆపేశారు.

 మద్దికెర రైల్వేస్టేషన్‌లో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి పునాదులు తవ్వే పనులను ఇటీవల మొదలుపెట్టారు.

 గురువారం కొందరు దుండగులు వచ్చి కూలీలు, సిబ్బందిపై రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడా పనులు నిలిచిపోయాయి.

ఈ నెలాఖరు వరకే గడువు

గుంతకల్లు- గుంటూరు వరకు డబ్లింగ్‌ పనులు, కొత్త రైల్వేస్టేషన్లు, వంతెనలు, విద్యుత్తు లైన్ల ఏర్పాటు తదితర పనుల కోసం రైల్వే శాఖ 2018లో రూ.3,048 కోట్లతో టెండర్లు పిలిచింది. ఒప్పందం చేసుకొన్న గుత్తేదారులు పనులు మొదలుపెట్టారు. ఈ నెలాఖరుకు డబ్లింగ్‌ పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ నుంచి ఆదేశాలు అందడంతో వేగవంతం చేశారు. ఇంతలోనే కొందరు ఆటంకం సృష్టించడంతో ఆగిపోయాయి. ‘‘ రక్షణ కల్పించే వరకు పనులు చేసే పరిస్థితి లేదని ’’ పనులు చేపడుతున్న కంపెనీ మేనేజర్‌ నందకిశోర్‌ పేర్కొన్నారు.

రక్షణ కల్పిస్తాం

- పి.రామకృష్ణారెడ్డి,

ఆర్పీఎఫ్‌ ఎస్సై, గుంతకల్లు

మద్దికెర ప్రాంతంలో గుత్తేదారులు, వారి సిబ్బంది, కూలీలపై దాడి జరిగిన విషయం మా దృష్టికి వచ్చింది. పనులు జరిగే ప్రాంతాన్ని పరిశీలించాం. ఇక నుంచి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా రక్షణ కల్పిస్తాం. పనులు జరిగే సమయంలో సిబ్బందిని కాపలా ఉంచుతాం.

త్వరలో నిందితులను పట్టుకుంటాం

- మమత, ఎస్సై, మద్దికెర

కంపెనీ మేనేజర్‌ నందకిశోర్‌ ఫిర్యాదు మేరకు రైల్వే గుత్తేదారులు, వారి సిబ్బందిపై దాడికి పాల్పడిన ఏడుగురిపై కేసు నమోదు చేశాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం.

Read latest Kurnool News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని