logo

కొత్తవారికి అభయహస్తం

అధికార పార్టీ అభ్యర్థులు ప్రకటించిన నుంచి వీరికి ప్రత్యర్థులు ఎవరన్న ఉత్కంఠ అంతటా నెలకొంది.

Updated : 28 Oct 2023 05:06 IST

అధికార పార్టీ అభ్యర్థులు ప్రకటించిన నుంచి వీరికి ప్రత్యర్థులు ఎవరన్న ఉత్కంఠ అంతటా నెలకొంది. ఎట్టకేలకు కాంగ్రెస్‌ మలివిడత జాబితా శుక్రవారం విడుదలయ్యింది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాల్లో ఆరుగురు కొత్తవాళ్లే. తొలిసారి తలపడుతున్న వాళ్లే. కాంగ్రెస్‌ తొలి జాబితాలో ఇద్దరు, మలి జాబితాలో నలుగురు తొలిసారి పోటీకి సిద్ధమై అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అభ్యర్థుల పూర్వాపరాలు తెలుసుకుందాం.

న్యూస్‌టుడే, కొత్తకోట, ఆత్మకూరు, నారాయణపేట, వనపర్తి, జడ్చర్ల గ్రామీణం, పాలమూరు పురపాలకం


 

పేరు : యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

పుట్టిన తేదీ : 03.01.1970

స్వగ్రామం : వెల్దండ

తల్లిదండ్రులు : రామేశ్వరమ్మ, జానకిరాంరెడ్డి

కుటుంబ నేపథ్యం : భార్య లక్ష్మీప్రసన్న, కుమారుడు ఆర్నవ్‌, కుమార్తె అక్షర

 చదువు : ఎంఏ, ఎంబీఏ

రాజకీయ ప్రవేశం : కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో కస్టమ్స్‌ ప్రివెంటివ్‌ అధికారిగా దిల్లీ, ముంబయిల్లో పనిచేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి 2002లో తెరాసలో చేరారు. తెరాసలో వివిధ పదవులు చేపట్టారు. 2007 నుంచి 2009 వరకు తెరాస జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. 2007లో ఎమ్మెల్సీ బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2009లో తెరాస నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. 2012లో మహబూబ్‌నగర్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2014లో మళ్లీ భాజపా తరఫున పోటీచేసి 2,535 స్వల్ప ఓట్ల తేడాతో తెరాస అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత భాజపాలో కొనసాగినా పరిస్థితుల ప్రభావంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ నియామకం తర్వాత మళ్లీ భాజపా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఇటీవల భాజపా తీరుపై నిరసన గళం వినిపించారు. అధిష్ఠానం ఆగ్రహానికి గురై పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. వెంటనే భాజపాను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరగా టికెట్‌ ఖరారైంది.


పేరు :  గౌని మధుసూదన్‌రెడ్డి

పుట్టిన తేదీ : 04.05.1971

చదువు : బీఏ. ఎల్‌ఎల్‌బీ

వృత్తి : హైక్టోర్టు న్యాయవాది

కుటుంబ నేపథ్యం : వ్యవసాయం

భార్య : కవిత

పిల్లలు :  వినయప్రణీత్‌రెడ్డి, లక్ష్మీ సహస్ర


పేరు : డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి

పుట్టిన తేదీ : 01.06.1955

చదువు : ఎమ్మెస్సీ (అగ్రి), పీహెడ్‌డీ (మలేషియా), ఎల్‌ఎల్‌బీ

కుటుంబం : భార్య, ఇద్దరు కుమారులు.

వృత్తి : వ్యవసాయం, రాజకీయం

రాజకీయరంగ ప్రవేశం: 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం. 1983-85 వరకు యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు. 1989-1993 వరకు ఉమ్మడి పాలమూరు డీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి. 1989లో మొదటి సారి వనపర్తి ఎమ్మెల్యేగా విజయం. 1997-99 వరకు ఏపీసీసీ ప్రధానకార్యదర్శి. 1999, 2004, 2014లో వనపర్తి ఎమ్మెల్యేగా విజయం. 2001-2003 వరకు తెలంగాణ కాంగ్రెస్‌ ఫోరం కన్వీనరు. 2007-2009 వరకు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.


పేరు : వాకిటి శ్రీహరి

తండ్రి : నర్సింహులు

తల్లి : రాములమ్మ

పుట్టిన తేది : 01.11.1972

విద్యాభ్యాసం : బీఏ

కుటుంబం : భార్య లలిత, కుమారులు అచ్యుత్‌ రామరాజ్‌, అమిత్‌ రామరాజ్‌

రాజకీయ నేపథ్యం : 2001లో సర్పంచి, 2014లో జడ్పీటీసీ సభ్యుడు, ఉమ్మడి జిల్లా జిల్లా పరిషత్‌లో ఫ్లోర్‌ లీడర్‌, ప్రస్తుతం నారాయణపేట జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు. (2006లో భార్య ఎంపీటీసీ సభ్యురాలు)


పేరు : జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

పుట్టిన తేదీ : 31.12.1980

స్వగ్రామం : రంగారెడ్డిగూడ(రాజాపూర్‌)

చదువు : బీటెక్‌ (కంప్యూటర్స్‌)

వృత్తి : ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఎక్సెల్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌

రాజకీయ ప్రవేశం : 2012లో వైకాపాలో చేరి రాజకీయ రంగప్రవేశం చేశారు. 2019 నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

కుటుంబ నేపథ్యం : తండ్రి దిలీప్‌రెడ్డి, తల్లి శశికళ(సర్పంచి), భార్య మంజూష, కుమారుడు హితేశ్‌రెడ్డి

అనుభవం : స్వగ్రామంతో పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్లు ఏర్పాటు చేశారు. పరిశ్రమల కాలుష్యంపై రైతులకు మద్దతుగా, కార్మికుల సమస్యలపైనా ఆందోళనలు చేపట్టారు. సోదరుడు జనంపల్లి దుష్యంత్‌రెడ్డి కార్మిక నేత. ఆయన కూడా సర్పంచిగా పనిచేశారు. ప్రస్తుతం తల్లి సర్పంచిగా ఉన్నారు. 2019లో ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన మల్లు రవి వెంట చురుగ్గా తిరిగారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్తగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.


పేరు : చిట్టెం పర్నిక రెడ్డి

పుట్టిన తేదీ : 20.08.1993

తండ్రి : చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి

తల్లి : చిట్టెం లక్ష్మి,  ఐఏఎస్‌.(రాష్ట్ర పౌరసరఫరాలశాఖ అదనపు కార్యదర్శి)

చదువు :  ఎంబీబీఎస్‌, ఎండీ(రేడియాలజీ)

వృత్తి : వైద్యురాలు

భర్త : డాక్టర్‌ విశ్వజిత్‌రెడ్డి

రాజకీయ రంగప్రవేశం : 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా

కుటుంబ నేపథ్యం : ధన్వాడకు చెందిన చిట్టెం నర్సిరెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2005లో పేటలో జరిగిన నక్సలైట్ల కాల్పుల్లో చనిపోయారు. ఆయన చిన్న కుమారుడు, యువజన కాంగ్రెస్‌ రాష్ట్రనాయకుడిగా ఉన్న వెంకటేశ్వర్‌రెడ్డి కూడా మరణించారు. 2005 ఉప ఎన్నికల్లో, అనంతరం రెండుసార్లు చిట్టెం నర్సిరెడ్డి పెద్ద కుమారుడు రాంమోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వెంకటేశ్వర్‌రెడ్డి కుమార్తె చిట్టెం పర్నిక రెడ్డి. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు, కుంభం శివకుమార్‌రెడ్డికి స్వయానా మేనకోడలు అవుతారు.

అనుభవం : ఈమె రాజకీయాలకు కొత్త. కానీ కుటుంబమంతా నాయకులే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని