logo

కొడంగల్‌ చరిత్రలో భారీ మెజార్టీ

కొడంగల్‌ నియోజకవర్గం చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. కౌంటింగ్‌ ప్రారంభమైన నుంచి ప్రతి రౌండులో కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యం కొనసాగించింది. మొత్తం 13 మంది రంగంలో నిలిచారు.

Published : 04 Dec 2023 04:44 IST

కోస్గిలో కాంగ్రెస్‌ నాయకుల విజయోత్సవం

కోస్గి, న్యూస్‌టుడే: కొడంగల్‌ నియోజకవర్గం చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. కౌంటింగ్‌ ప్రారంభమైన నుంచి ప్రతి రౌండులో కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యం కొనసాగించింది. మొత్తం 13 మంది రంగంలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి 106558 ఓట్లు రాగా, భారాస అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 74709 ఓట్లు వచ్చాయి. తుది ఫలితంలో   మొత్తం 31849 ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. 1952 ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థి అనంతరెడ్డి, ఆర్‌పీˆఐ అభ్యర్థి జాన్‌ గోపాల్‌పై 20,419 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్నాథ్‌రెడ్డి తెదేపా అభ్యర్థి రతన్‌లాల్‌ లాహోటీపై 20,585 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటి వరకు ఇవేే రికార్డుగా ఉన్నాయి. తొలిసారిగా 30 వేల మార్కును దాటి కొడంగల్‌ చరిత్రలో రేవంత్‌ రికార్డు నెలకొల్పారు. నియోజకవర్గంలో చివరి మూడు ఎన్నికలు కాంగ్రెస్‌, భారాస మధ్యనే పోరు సాగింది. రెండు పర్యాయాలు హోరాహోరీగా సాగగా, ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు ఏకపక్షంగా సాగింది.  

ఎందుకీ రికార్డు

  • ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం జరగడంతో రేవంత్‌ గెలిస్తే నియోజకవర్గం పెద్దఎత్తున అభివృద్ధి జరుగుతుందన్న భావన ఏర్పడింది.
  • ఆరు గ్యారంటీల హామీలను స్థానిక నాయకులు ఇంటింటికీ కరపత్రాల ద్వారా తెలియజేశారు.నాయకులు, కార్యకర్తలు ఒక్కో ఇంటిని నాలుగైదుసార్లు సందర్శించారు.
  • రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి గురించి వివరిస్తూ వచ్చారు.
  • భారాస నాయకులు, కార్యకర్తలను పెద్దఎత్తున కాంగ్రెస్‌లో చేర్చుకోవడం కొంత ప్రభావం చూపింది.
  • సాగునీరు తీసుకువస్తానని, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని పదేపదే చెప్పడం.
  • యువతకు రేవంత్‌పై క్రేజ్‌ ఉండడం, ఉద్యోగులు, నిరుద్యోగులు మొగ్గు చూపడం.

నరేందర్‌రెడ్డి ఓటమికి కారణం

  • తమనుపట్టించుకోలేదన్న భావన స్థానిక నాయకుల్లో ఉంది. పార్టీ వీడుతున్న వారిని నివారించే ప్రయత్నం చేయలేదు.
  • ప్రత్యర్థి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న ప్రచారం.
  • కొన్ని ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందకపోవడం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని