logo

సైబర్‌ నేరగాళ్లతో తస్మాత్‌ జాగ్రత్త

సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని ఎస్పీ యోగేశ్‌గౌతం ఓ ప్రకటనలో హెచ్చరించారు.

Published : 29 Mar 2024 03:31 IST

నారాయణపేట, న్యూస్‌టుడే : సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని ఎస్పీ యోగేశ్‌గౌతం ఓ ప్రకటనలో హెచ్చరించారు. లోన్‌యాప్స్‌ ద్వారా అప్పులు తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు ఆకర్షితులు కావద్దన్నారు.  అధిక లాభాల కోసం ఆశపడి ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టవద్దని, ఎవరో చెప్పింది విని, సామాజిక మాధ్యమాల్లో యాప్స్‌చూసి మోసపోవద్దని సూచించారు. తెలియని నంబరు నుంచి వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో వీడియో కాల్‌చేసి ఫోటోలను మార్ఫింగ్‌ చేస్తున్న ముఠాలు ఉన్నాయన్నారు. న్యూడ్‌ ఫోటోలు అతికించి బంధువులు, సన్నిహితులకు పంపిస్తామంటూ ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తారని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. లాటరీ పేరుతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పకూడదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని