logo

నేటి నుంచి రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం

మహబూబ్‌నగర్‌ - జడ్చర్ల రోడ్డులోని మయూరి పార్కు సమీప కేశవరెడ్డి ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి మే 5 వరకు రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు సంస్కృత భారతి, రామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు యాదయ్య, వెంకట్‌రెడ్డి, రాజ్‌మల్లేశ్‌ వెల్లడించారు.

Published : 29 Apr 2024 05:19 IST

మహబూబ్‌నగర్‌ సాంస్కృతికం : మహబూబ్‌నగర్‌ - జడ్చర్ల రోడ్డులోని మయూరి పార్కు సమీప కేశవరెడ్డి ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి మే 5 వరకు రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు సంస్కృత భారతి, రామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు యాదయ్య, వెంకట్‌రెడ్డి, రాజ్‌మల్లేశ్‌ వెల్లడించారు. సంస్కృతం అందరికీ నేర్పించాలనే సంకల్పంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంస్కృతంలో ఏమాత్రం ప్రవేశం లేనివారికి భాషా ప్రవేశవర్గ పేరిట శిక్షణ ఉంటుందన్నారు. ఇందుకు 14 ఏళ్లు వయసు పైబడిన వారు అర్హులని తెలిపారు. సంస్కృత సంభాషణ జ్ఞానం ఉన్నవారికి భాషా ప్రబోధన వర్గ పేరిట శిక్షణ ఉంటుందన్నారు. శిబిరంలో పాల్గొనే వారు వారం పాటు ఇక్కడే ఉండాల్సి ఉంటుందని, అందరికీ భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు శిబిరంలో పాల్గొనాలని వారు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని