logo

డిగ్రీ ప్రవేశాలకు వేళాయె

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ప్రకటన శుక్రవారం విడుదలైంది. మూడు విడతల్లో జరిగే ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 6 నుంచి ప్రారంభం కానుంది. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Updated : 06 May 2024 06:20 IST

నేటి నుంచి దోస్త్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

 

దోస్త్‌ వెబ్‌సైట్‌ ముఖచిత్రం

న్యూస్‌టుడే, పాలమూరు విశ్వవిద్యాలయం : డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ప్రకటన శుక్రవారం విడుదలైంది. మూడు విడతల్లో జరిగే ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 6 నుంచి ప్రారంభం కానుంది. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 8 నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయి. పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని 91 డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల కింద ఈ ఏడాది 29,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

నమోదు ప్రక్రియ : ఈ నెల 6 నుంచి 25 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్‌కు రూ.200 రుసుంతో అవకాశం కల్పించారు. ఈ నెల 15 నుంచి 27వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్‌ 3న మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్‌ 4 నుంచి 10వ తేదీ లోపు సెల్ఫ్‌ రిపోర్టుకు అవకాశం కల్పించారు.

  • రెండో విడత జూన్‌ 4 నుంచి 13 వరకు రూ.400 రసుంతో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. జూన్‌ 4 నుంచి 14 వరకు వెబ్‌ ఆప్షన్లు ఉంటాయి. జూన్‌ 18న రెండో దశ సీట్ల కేటాయింపు చేపట్టి.. జూన్‌ 19 నుంచి 24 వరకు సెల్ఫ్‌ రిపోర్టుకు అవకాశం ఇచ్చారు.
  • మూడో విడత జూన్‌ 19-25 వరకు రూ.400 రుసుంతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్‌ 19 - 25వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు, జూన్‌ 29న సీట్ల కేటాయింపు చేపడతారు.

కొత్త కోర్సులు ఇవే

మహబూబ్‌నగర్‌లోని ఎన్టీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌, మహబూబ్‌నగర్‌ పట్టణం క్రిస్టియన్‌పల్లిలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌, బీబీఏ రిటైల్‌ ఆపరేషన్స్‌, జడ్చర్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీబీఏ లాజిస్టిక్స్‌కు రాష్ట్ర కళాశాల విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారులు అవకాశం కల్పించారు. వీటితో పాటు స్వయంఉపాధి కోర్సులు, ఫార్మా రంగానికి సంబంధించిన కోర్సులు ఈ ఏడాది కొన్ని కళాశాలలకు ఉన్నత విద్యామండలి కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

సద్వినియోగం చేసుకోవాలి  

ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థి డిగ్రీ ప్రవేశానికి దోస్త్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ ఏడాది నూతన కోర్సులు ప్రవేశపెడుతున్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న కోర్సుపై సమగ్ర అవగాహన కలిగి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. సందేహాల నివృత్తికి దోస్త్‌ వెబ్‌సైట్‌లో పొందుపరచిన హెల్ప్‌లైన్‌ కేంద్రాలకు నేరుగా వెళ్లాలి.

డా.డి.మధుసూదన్‌రెడ్డి, పీయూ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని