logo

అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ సాయి సంగీతకు అభినందన

జూనియర్‌ ఏషియన్‌ పోటీల్లో స్వర్ణం సాధించిన మహబూబ్‌నగర్‌కు చెందిన అథ్లెట్‌ సాయి సంగీతను పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి లక్ష్మికాంత్‌ రాథోడ్‌ మంగళవారం సన్మానించారు.

Published : 08 May 2024 03:14 IST

మహబూబ్‌నగర్‌ క్రీడలు, న్యూస్‌టుడే : జూనియర్‌ ఏషియన్‌ పోటీల్లో స్వర్ణం సాధించిన మహబూబ్‌నగర్‌కు చెందిన అథ్లెట్‌ సాయి సంగీతను పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి లక్ష్మికాంత్‌ రాథోడ్‌ మంగళవారం సన్మానించారు. గత నెలలో దుబాయ్‌లో నిర్వహించిన అథ్లెటిక్స్‌ పోటీల్లో సాయి సంగీత 4×400 మీటర్ల రిలే పరుగులో బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికపై పాలమూరు జెండాను ఎగురవేసిందని సాయిసంగీతను ప్రశంసించారు. ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొనేలా ఎదగాలన్నారు.

ఉప కులపతికి సన్మానం : తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పీయూ ఉప కులపతి లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ను మంగళవారం ఘనంగా సన్మానించారు. పీయూలో రూ.9కోట్లకు పైగా వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయటం ఎంతో అభినందనీయమన్నారు. అథ్లెటిక్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జూనియర్‌ కోచ్‌, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్‌, అథ్లెటిక్స్‌ సంఘం రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, కోశాధికారి డా.రాజేశ్‌కుమార్‌, సంఘం నేతలు పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, శరత్‌చంద్ర, వి.చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు