logo

ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని ప్రత్యేక సేవలు

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇప్పటికే అందిస్తున్న ఐదు రకాల వైద్యసేవలతోపాటు మరో ఏడు కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య,ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది.

Updated : 18 May 2024 03:47 IST

నారాయణపేట, న్యూస్‌టుడే : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇప్పటికే అందిస్తున్న ఐదు రకాల వైద్యసేవలతోపాటు మరో ఏడు కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య,ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది. ఈ దిశగా వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చారు. కొత్త సేవలు అందుబాటులోకి వస్తే ప్రజలకు వచ్చే దాదాపు రుగ్మతలన్నింటికీ వైద్యం అందించినట్లు అవుతుంది.

జిల్లా ఆస్పత్రితోపాటు రెండు సామాజిక ఆరోగ్యకేంద్రాలు, 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 87 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉండగా, ఇందులో 59 సబ్‌సెంటర్లను పల్లె దవాఖానాలుగా మార్చి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో మూడోవంతు మాతా, శిశు సంరక్షణ, టీకాలు, కుటుంబ నియంత్రణ, అంటువ్యాధుల నియంత్రణ, సాధారణ వ్యాధులకు చికిత్సలు అందజేస్తున్నాయి. జాతీయ అసాంక్రమిక వ్యాధులు ప్రాజెక్టు(నాన్‌ కమ్యూనికేబుల్‌ డీసీˆజెస్‌)లో భాగంగా ఇక నుంచి జిల్లాలో అదనంగా ప్రత్యేక సేవలు అందిస్తారు. మరికొన్ని రోజుల్లో ఏడు రకాల సేవలు అందుబాటులోకి వస్తాయి.

25 కేంద్రాల్లో....

జిల్లాలోని పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(మద్దూరు మినహా), మరో 15 ఆరోగ్య ఉపకేంద్రాల్లో కొత్తగా ఏడు రకాల వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. సర్జఖాన్‌పేట, గుడిగుండ్ల, మంథన్‌గోడ్‌, కల్వాల, అప్పంపల్లి, రాకొండ, చిన్నజట్రం, పల్లెర్ల, కొమ్మూరు, జాధవరావుపల్లి, కాన్‌కుర్తి, చెర్లపల్లి, జాజాపూర్‌, భూనీడ్‌, కొల్పూర్‌ గ్రామ ఆరోగ్య ఉపకేంద్రాలను కొత్త సేవలకు ఎంపిక చేశారు. మానసిక సమస్యలు, చెవి-ముక్కు-గొంతు, కళ్లు, దంత చికిత్సలతోపాటు వయసు దాటిన వృద్ధులకు సైతం ఎలర్జీ, హెల్త్‌కేర్‌, తక్షణ ఉమశమన వైద్యం తదితర సేవలు మొదటి విడతలో అందిస్తారు. కొత్తగా చేపట్టనున్న వైద్యసేవలపై వైద్యాధికారులకు సరైన అవగాహనలేకపోవడంతో శిక్షణ ఇప్పించారు. కేంద్రాలకు వచ్చే రోగులకు వైద్యసేవలు అందించే విధానం, తీసుకోవల్సిన చర్యలు, జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు వైద్యాధికారులు తెలిపారు.గ్రామీణులకు ఈ సేవల ద్వారా మేలు జరుగుతుందని ఈ ప్రాజెక్టు అధికారి డా.సాయిరాం పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని