logo

మహమ్మారి బారిన 89 మంది..

జిల్లాలో ఆదివారం 89 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారని ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. యాంటిజెన్‌ పరీక్షల్లో భాగంగా 1619 మంది

Published : 24 Jan 2022 01:05 IST

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఆదివారం 89 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారని ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. యాంటిజెన్‌ పరీక్షల్లో భాగంగా 1619 మంది నమూనాలు సేకరించగా 53 మంది, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో 36 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. పటాన్‌చెరులో 30, సంగారెడ్డిలో 25, జహీరాబాద్‌లో 10, నారాయణఖేడ్‌లో 10, బొల్లారం, కంది, గుమ్మడిదలలో ముగ్గురు చొప్పున, రామచంద్రాపురంలో అయిదుగురికి వైరస్‌ నిర్ధారణ కాగా.. వారంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు.

కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌: కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా జిల్లాలో ఆదివారం 15,305 మందికి టీకా పంపిణీ చేశామని జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి ఒక ప్రకటనలో తెలిపారు. పీహెచ్‌సీల స్థాయిలో 2,120, ఆరోగ్య ఉప కేంద్రాల్లో 10,141, పురపాలికల పరిధిలో 1,476, 15-18 ఏళ్ల వయస్సుల వారు 1,512, బూస్టర్‌ డోస్‌ 56 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు ఆమె వెల్లడించారు.


3,912 మంది వైరస్‌ అనుమానితులు

కంది మండలం తున్కిల్లతండాలో జ్వర సర్వే

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో మూడో రోజైన ఆదివారం జ్వర సర్వేను వైద్యారోగ్యశాఖ సిబ్బంది కొనసాగించారు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈనెల 21న ఈ సర్వే ప్రారంభం కాగా.. మూడో రోజు జిల్లా వ్యాప్తంగా 695 గ్రామ పంచాయతీల పరిధిలో 1278 మంది.. బృందాలులుగా ఏర్పడి 77,144 ఇళ్లలో సర్వే చేశారు. 3,912 మందికి కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి.. అనుమానితులుగా తేల్చారు. వారందరికీ మందుల కిట్లు ఉచితంగా అందజేశారు. ఇప్పటి వరకు సదాశివపేట మండలం ఆత్మకూర్‌ పీహెచ్‌సీ పరిధిలో, హత్నూర మండలం చింతల్‌ చెర్వు, గుమ్మడిదల, రాయికోడ్‌, న్యాల్‌కల్‌, కోహీర్‌ మండలం దిగ్వాల్‌ పీహెచ్‌సీల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటి సర్వే పూర్తయినట్లుగా వైద్యాధికారులు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లోనూ సోమవారం నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని