logo

స్కేటింగ్‌ చైతన్యాస్త్రం

ఆ యువకుడికి స్కేటింగ్‌ అంటే అమితమైన ఇష్టం. ఇది ధనికులకే పరిమితం. దీన్ని సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో దేశవ్యాప్తంగా స్కేటింగ్‌ యాత్ర చేపట్టారు.

Published : 04 Feb 2023 01:49 IST

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: ఆ యువకుడికి స్కేటింగ్‌ అంటే అమితమైన ఇష్టం. ఇది ధనికులకే పరిమితం. దీన్ని సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో దేశవ్యాప్తంగా స్కేటింగ్‌ యాత్ర చేపట్టారు. ఆయనే కేరళ రాష్ట్రం కాలికర్‌కు చెందిన మధు. తల్లిదండ్రులు బేబి, మహేశ్‌. ప్రస్తుం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. ఆర్థిక ఇబ్బందులున్నా పట్టుదలతో రాణిస్తున్నారు. చిన్నతనంలో స్కేటింగ్‌ బోర్డును కొనుగోలు చేసి స్వతహాగా నైపుణ్యాన్ని సాధించారు. పలు స్థాయిల్లో జరిగిన పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. ఇదే ఉత్సాహంతో ఆటకు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జనవరి 17న కేరళ రాష్ట్రం కాలికర్‌లో యాత్రను ప్రారంభించారు. కేరళ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. అక్కడి నుంచి కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో పూరిచేసుకొని తెలంగాణలో అడుగుపెట్టారు. ఇప్పటివరకు 2500 కి.మీ. యాత్ర పూర్తవగా, శుక్రవారం నర్సాపూర్‌కు చేరుకున్నారు. నిర్దిష్ట సమయంలో కిలోమీటర్ల పొడవునా స్కేటింగ్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. లడాక్‌ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర నిర్వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ‘న్యూస్‌టుడే’ పలకరించగా.. తన ఊర్లో ఏ పనికైనా స్కేటింగ్‌ చేస్తూ రోడ్లపై ప్రయాణించేవాడినని, దినచర్యలో భాగం చేసుకున్నానని చెప్పారు. ఎంతోమంది నన్ను ఆదరిస్తున్నారని, వారి సహకారంతో యాత్ర కొనసాగిస్తున్నానని చెప్పుకొచ్చారు. స్థానిక యువకులు సత్కరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని