logo

భాజపా మళ్లీ వస్తే ప్రజల జీవితాలు ఆగం

భాజపా అధికారం చేపట్టిన పదేళ్లలో దేశంలో అసమానతలు పెరిగాయని ఆచార్య కోదండరాం అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సోమవారం తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు ఆగమవుతాయన్నారు.

Published : 30 Apr 2024 04:00 IST

ఆచార్య కోదండరాం

మాట్లాడుతున్న ఆచార్య కోదండరాం, వేదికపై లక్ష్మారెడ్డి, వీరన్నయాదవ్‌, సారయ్య, లింగమూర్తి తదితరులు

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: భాజపా అధికారం చేపట్టిన పదేళ్లలో దేశంలో అసమానతలు పెరిగాయని ఆచార్య కోదండరాం అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సోమవారం తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు ఆగమవుతాయన్నారు. సంపదను కొంతమందికి దోచి పెడుతున్నారని, కార్పొరేట్‌ రంగానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. గోమాంసంపై నిషేధ]ం అంటూనే, ఎగుమతిదారుల నుంచి చందాలు తీసుకుందని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థ లైన రైల్వే, సింగరేణి, ఎల్‌ఐసీ తదితర వాటిని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించిందన్నారు. భారత్‌ జోడో అభియాన్‌ బాధ్యుడు, ఆచార్య యోగేంద్రయాదవ్‌ మాట్లాడుతూ మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల ఆదరణ లేకపోవడంతో భాజపా మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు కన్నెకంటి రవి మాట్లాడుతూ భాజపా ప్రభుత్వ వైఫల్యాలు, రైతు వ్యతిరేక విధానాలను గురించి ప్రజలకు వివరించాలని కోరారు. సదస్సులో నియోజకవర్గ తెలంగాణ ఐకాస కన్వీనర్‌ కవ్వ లక్ష్మారెడ్డి,  సమన్వయకర్తలు మేకల వీరన్నయాదవ్‌, డ్యాగల సారయ్య అధ్యక్షత వహించగా విశ్రాంత ఆచార్యులు వీరన్ననాయక్‌. కాంగ్రెస్‌, సీపీఐ, ప్రజా సంఘాల ప్రతినిధులు బొలిశెట్టి శివయ్య, కేడం లింగమూర్తి, చిత్తారి రవీందర్‌, గడిపె మల్లేశ్‌, కోయడ కొమురయ్య, చెప్యాల ప్రకాశ్‌, రాజగోపాల్‌రావు పాల్గొన్నారు.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని