logo
Published : 29/11/2021 02:02 IST

కేసీఆర్‌ రాచరిక పోకడలకు చరమగీతం పాడాల్సిందే

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

చౌటుప్పల్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాచరిక పోకడలకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడటం తప్పదని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనకు ఆదివారం వెళ్తూ మార్గమధ్యలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం లింగోజీగూడెం గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. భాజపా జెండా ఎగురవేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ గడ్డమీద కేసీఆర్‌ అహంకార ధోరణి ఇక చెల్లదని, హుజూరాబాద్‌ ఎన్నికల్లో ప్రజలు చెంప చెళ్లుమనిపించారని వ్యాఖ్యానించారు. ఆ కోపాన్ని రైతులపై తీసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్‌నాం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీచ బుద్దితో, కుట్రతో రైతులను ఉసి కొల్పుతున్నారని, వారి కళ్లలో మట్టి గొడుతున్నారని విమర్శించారు. నాలుగేళ్ల క్రితమే రాష్ట్రంలోని ధాన్యానికి అనుగుణంగా రైసు మిల్లులను ఆధునీకరించేలా చేయాలని కేంద్రం సూచించినా నిమ్మకు నీరెత్తినట్టు, నీరో చక్రవర్తిలా వ్యవహరించాడని విమర్శించారు. కేసీఆర్‌ 84 శాతం ప్రజా వ్యతిరేకత గల అసమర్దపు ముఖ్యమంత్రిగా జాతీయ సర్వేలో తేలిందన్నారు. రైతుల పక్షాన నిలిచిన ప్రతిపక్షాలపై దౌర్జన్యం చేయిస్తున్నాడని అన్నారు. అధికారం ఉందని, పోలీసులు సహకరిస్తున్నారని, పిచ్చి పనులు చేస్తున్నాడని విమర్శించారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్‌కు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు, ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్‌, నాయకులు దూడల భిక్షం, ఊడుగు వెంకటేశం, రిక్కల సుధాకర్‌రెడ్డి, బాతరాజు సత్యం, భిక్షమాచారి, ఉబ్బు బుచ్చయ్య, అశోక్‌ తదితరులు ఈటెల రాజేందర్‌ను ఘనంగా స్వాగతించారు. పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.  

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని