logo
Published : 03 Dec 2021 03:13 IST

ఆటల్లో అదుర్స్‌

బ్యాడ్మింటన్‌ సౌత్‌జోన్‌ పోటీలకు ఎంపిక

బ్యాడ్మింటన్‌ ఆడుతున్న క్రీడాకారులు

నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: వారంతా మారుమూల ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన పిల్లలు. సౌకర్యాలు అందుబాటులో లేకున్నా.. ఆట మీద ఉన్న ఆసక్తితో దూసుకెళ్తున్నారు. ఇటు చదువులోనూ.. అటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. నిత్య సాధనతో తమ ఆటను మరింత మెరుగుపర్చుకుని.. పాల్గొన్న ప్రతి పోటీల్లో సత్తా చాటుతూ విజయకేతనం ఎగురవేస్తున్నారు. సూర్యాపేటలో బుధవారం జరిగిన ఎంజీయూ పరిధిలోని అంతర్‌కళాశాలల స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో జిల్లాకు చెందిన కొందరు విద్యార్థినులు ప్రతిభ చూపారు. ఈ నెల 14 నుంచి కర్నూలులో నిర్వహించే సౌత్‌జోన్‌ అంతర్‌ విశ్వవిద్యాలయాల బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపికయ్యారు. వారిపై ‘న్యూస్‌టుడే’ కథనం.


ఇటు చదువు...అటు క్రీడలు
అనూష, తాస్కానిగూడెం, చండూర్‌ మండలం

అమ్మనాన్నలు భిక్షపతి, పార్వతి. నాన్న వ్యాపారం చేస్తుంటారు. ప్రస్తుతం నేను ఎంజీయూలో ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. బ్యాడ్మింటన్‌ ఆటను పాఠశాలస్థాయి నుంచే నేర్చుకున్నాను. ఇప్పటి వరకు జాతీయస్థాయిలో ఒక సారి, రాష్ట్రస్థాయిలో రెండు సార్లు ఆడాను. తాజాగా సౌత్‌జోన్‌ పోటీలకు ఎంపికయ్యాను. పోటీల్లో ప్రతిభ చాటేందుకు నిత్యం సాధన చేస్తున్నాను. క్రీడలు ఆడడం ద్వారా నాలో క్రమశిక్షణ ఏర్పడింది. తద్వారా చదువులో..క్రీడల్లో రాణిస్తూ ముందుకుసాగుతున్నా. భవిష్యత్తులో అంతర్జాతీయస్థాయిలో రాణించడమే నా ధ్యేయం.


బాల్యం నుంచే ఇష్టం

హారిక, చిన్నకాపర్తి, చిట్యాల

అమ్మానాన్నలు నర్సింహ్మ, నిర్మల. నాన్న కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్‌ ఆటంటే ఎంతో ఇష్టం. మా అమ్మనాన్నల ప్రోత్సాహంతో ఆ క్రీడలో శిక్షణ పొందాను. గతంలో ఎంజీయూలో నిర్వహించిన అంతర్‌కళాశాలల పోటీల్లో తృతీయ బహుమతి సాధించాను. తాజాగా సౌత్‌జోన్‌ పోటీలకు ఎంపికయ్యాను. ఇక ముందు మరింత పట్టుదలతో బ్యాడ్మింటన్‌లో రాణించి...దేశానికి పేరు తేవాలని ఉంది.


ఆటలకే ప్రధాన్యం

-రాధశ్రీ, మిర్యాలగూడ

అమ్మానాన్నలు ఉపేందర్‌, సుజాత. నాన్న ప్రైవేటు ఉద్యో గం చేస్తున్నారు. ప్రస్తుతం కేఎల్‌ఎన్‌ డిగ్రీ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. అమ్మాయిలకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని గుర్తించి బ్యాడ్మింటన్‌ క్రీడలో శిక్షణ పొందాను. ఖాళీ సమయాన్ని వృథా చేసుకోకుండా ఆటకే ప్రాధాన్యం ఇస్తున్నా. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 8సార్లు ఆడాను. తాజాగా సౌత్‌జోన్‌ పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. క్రీడల కోటాలో ఉద్యోగం సాధించి..అమ్మనాన్నల కొర్కెను నెరవేరుస్తాను.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని