logo

శ్రీవారి సన్నిధిలో కొండ మహిళలు

వారంతా నెలకోసారి తిరుపతి వెళ్తుంటారు. సొంత ఖర్చులతో ప్రయాణం చేసి వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దేవరకొండ పట్టణానికి చెందిన 25 మంది మహిళలు.

Published : 04 Feb 2023 05:22 IST

తిరుమల తిరుపతి దేవస్థానంలో అగరబత్తులతో దేవరకొండ మహిళలు

దేవరకొండ, న్యూస్‌టుడే: వారంతా నెలకోసారి తిరుపతి వెళ్తుంటారు. సొంత ఖర్చులతో ప్రయాణం చేసి వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దేవరకొండ పట్టణానికి చెందిన 25 మంది మహిళలు. ఆరేళ్లుగా సేవలు చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు.

చేపట్టే కార్యక్రమాలు

* స్వామివారికి అలంకరించే వస్తువుల తయారీలో పాలుపంచుకుంటారు.
* వైకుంఠ-2 విభాగంలో తిరుపతికి వచ్చే వేలాది మంది భక్తులకు భోజనం వడ్డించడంతో పాటు అల్పాహారం అందిస్తారు.
* వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులతో దర్శనం, టికెట్ల కౌంటర్ల దగ్గర క్యూలైన్‌ ఎక్కువగా ఉంటుంది. వారందరనీ వరుస పద్ధతిలో క్రమబద్ధీకరిస్తారు.
* అనుమతి లేని వస్తువులను భక్తులు బ్యాగుల్లో తీసుకోస్తుంటారు. వాటిని నివారించేందుకు స్కానింగ్‌ సెôటర్ల వద్ద తనిఖీ విభాగంలో పని చేస్తారు.
* పల్లకి సేవ చేసే సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీంతోపాటు కోలాట కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని