logo

బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) మంగళవారం ప్రకటించింది. తొలి జాబితాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులకు స్థానం దక్కింది.

Updated : 04 Oct 2023 06:10 IST

నకిరేకల్‌, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) మంగళవారం ప్రకటించింది. తొలి జాబితాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులకు స్థానం దక్కింది. నకిరేకల్‌ నియోజకవర్గ(ఎస్సీ) అభ్యర్ధిగా మేడి ప్రియదర్శిని, దేవరకొండ నియోజకవర్గ(ఎస్టీ) అభ్యర్థిగా డా.ముదావత్‌ వెంకటేశ్‌చౌహన్‌, కోదాడ నియోజకవర్గ అభ్యర్థిగా పిల్లుట్ల శ్రీనివాస్‌, సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్థిగా వట్టె జానయ్యయాదవ్‌లను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ హైదరాబాద్‌లో ప్రకటించారని బీఎస్పీ నాయకులు తెలిపారు. సూర్యాపేటలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో వట్టె జానయ్యయాదవ్‌కు బీఎస్పీ మద్దతుగా నిలవడంతో ఆయనను ఆ పార్టీ నుంచి బరిలోకి దింపుతారని అంతా భావించినట్లే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.  నకిరేకల్‌ నియోజకవర్గంలోని చిట్యాల మండలం వట్టిమర్తికి చెందిన మేడి ప్రియదర్శిని ఓయూలో ఎంటెక్‌ పూర్తిచేశారు. ఇన్ఫోసిస్‌లో కొంత కాలం ఉద్యోగం చేశారు. ఆ తర్వాత వ్యాపారం నిర్వహించారు. రిషారియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గత 8 ఏళ్ల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని