logo

గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత

ఇంటర్‌ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు

Published : 25 Apr 2024 02:55 IST

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇంటర్‌ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు సాధించినట్లు ఆ సొసైటీ నల్గొండ రీజనల్‌ కోఆర్డినేటర్‌ కె.లక్ష్మయ్య తెలిపారు. రెండు జిల్లాల్లోని 12 గురుకులాల నుంచి 711 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 630 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. అదే విధంగా ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో 71.97శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రకటించారు. ప్రథమ సంవత్సరంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని 12 గురుకులాల నుంచి 678 మంది విద్యార్థులు హాజరుకాగా 488 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 75శాతం, ద్వితీయ సంవత్సరంలో 91.02శాతం ఉత్తీర్ణత సాధించగా సూర్యాపేట జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 50శాతం, ద్వితీయ సంవత్సరంలో 73.46శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని